కుంగింది అందుకే - కాళేశ్వరంపై సంచలన నివేదిక..!!

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవటం పై నేషనల్ డ్యాం సేఫ్టీ అధారిటీ సంచలన నివేదిక బయట పెట్టింది. ప్లానింగ్, డిజైన్, క్వాలీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ లో వైఫల్యం వలనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నిర్దారణకు వచ్చింది. బ్యారేజ్ వైఫల్యం కారణంగా ప్రజా జీవితానికి..ఆర్దిక వ్యవస్థకు తీవ్ర నష్టమని పేర్కొన్న అథారిటీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్యారేజ్ ను వినియోగించే అవకాశం లేదని నివేదకలో స్పష్టం చేసింది.

కాళేశ్వరంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంచలన నివేదిక ఇచ్చింది. బ్యారేజీ యొక్క ప్లానింగ్, డిజైన్ సరిగా లేదని తేల్చింది. మొత్తం బ్యారేజీని పునాదుల నుండి తొలగించి తిరిగి పూర్తిగా నిర్మించాలని అభిప్రాయపడింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించింది. డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడిందని నివేదికలో పేర్కొంది. బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం, ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యారేజీ లోడ్ వలన ఎగువన ఉన్న కాంక్రీట్ పైల్స్ బలహీన పడటం వల్ల పిల్లర్స్ సపోర్డ్ బలహీనపడిందని నివేదికలో వెల్లడించింది. కమిటీ కోరిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, 20 అంశాలు అడిగితే కేవలం 12 అంశాల వివరాలను మాత్రమే ఇచ్చిందని నివేదికలో స్పష్టం చేసింది.

Dam Safety Authority sensational Report on Kaleswaram, now it becomes poitical weapon for Opposition

రాష్ట్ర ప్రభుత్వం అందించిన డేటా అసంపూర్ణంగా ఉందని..అక్టోబర్ 29, 2023 లోపు పూర్తి వివరాలను అందించకపోతే బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన పరీక్షలు, అధ్యయనాలను రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని భావించాల్సి వస్తుందని పేర్కొంది. పిల్లర్లు కుంగిపోవటానికి బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవటం వలనేనని తెలిపింది. ఫౌండేషన్ మెటీరియల్ పిష్ఠంగా లేదని స్పష్టం చేసింది. బ్యారేజ్ లోడ్ కారణంగా కాంక్రీట్ దెబ్బ తింని స్పష్టం చేసింది. బ్యారేజీని తేలియాడ నిర్మాణంగా రూపొందించారని, కానీ స్థిరమైన నిర్మాణంగా చేయలేదని వివరించింది. బ్యారేజీ బ్లాక్ లలో సమస్య వలన మొత్తం బ్యారేజీని ఉపయోగించ టానికి అవకాశం లేదని పేర్కొంది. ఈ దశలో రిజర్వాయర్ నింపితే బ్యారేజ్ మరింత కుంగుతుందని నివేదిక స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+