తేల్చి చెప్పిన దానం నాగేందర్, కీలక పిలుపు..!!
తెలంగాణ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నవంబర్ 1న ఢిల్లీలో జరిగే ర్యాలీ కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ పార్టీ ముఖ్య నేతలకు ఈ ర్యాలీ గురించి స్పష్టత ఇచ్చారు. ఇక.. ఎలి నినో పరిస్థితుల పైనా రాజకీయ విమర్శల తీవ్రత పెరుగుతోంది. అటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతు న్నాయి. ఈ క్రమంలో దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేసారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం వచ్చే నెలలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ బై పోల్ కోసం మూడు ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి తిరిగి దానం నాగేందర్ పోటీ చేయటం ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో న్యాయ పరమైన వివాదాలు.. పార్టీలో సీటు కోసం పోటీ సైతం పెరుగుతోంది. ఈ క్రమంలోనే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రం లో ఎల్‌నినో ప్రభావం వంటి విపత్కర పరిస్థితులను కూడా బీఆర్‌ఎస్ రాజకీయాలకు వాడుకుంటోందని విమర్శించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చర్యలను వివరించారు. రాహుల్ గాంధీ పిలుపు మేరకు నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న మెగా ర్యాలీలో పాల్గొనాలని దానం నాగేందర్ కోరారు. బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపు ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.

ఛలో ఢిల్లీకి తరలి రావాలని పిలుపు
కాగా..ఓటు హక్కు పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ప్రజలు 'చలో ఢిల్లీ' కార్యక్రమంలో పాల్గొనాలని దానం నాగేందర్ పిలుపునిచ్చారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ప్రభావితమవుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నాయకులు మేడిగడ్డ పర్యటన చేపట్టడంపై దానం నాగేందర్ విమర్శలు చేశారు. విపత్కర పరిస్థితులపైనా రాజకీయాలు చేయడం సరికాదన్నారు. గోదావరి నది, ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు 10 టీఎంసీల నీటిని తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు కృషి చేశాయని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్నదని విమర్శించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఇప్పటివరకు మేడిగడ్డ నుంచి ఒక్క టీఎంసీ నీరు కూడా రాలేదని చెప్పుకొచ్చారు. 2027 జనవరి నాటికి నగరానికి మరో 5 టీఎంసీల నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.













Click it and Unblock the Notifications
