హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను అలిగానంతే, పార్టీ మారడం లేదు: దానం నాగేందర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను పార్టీ మారడం లేదని, పార్టీపై అలిగానని కాంగ్రెసు హైదరాబాద్ నాయకుడు దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై తీవ్రంగా మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు.

కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని ఆయన చెప్పారు. కాంగ్రెసులోనే ఉంటానని, కాంగ్రెసు కోసమే పని చేస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెసులో తనకంటూ ఓ గుర్తింపు ఉందని ఆయన అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం కోసం పనిచేస్తానని ఆయన అన్నారు.

Danam Nagender

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై తాను రేపు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి చర్చిస్తానని ఆయన చెప్పారు. తనకు కొందరు నేతలపై మాత్రమే అసంతృప్తి ఉందని ఆయన చెప్పారు. దానం నాగేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరుతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది.

సోమవారంనాడు ఆయన టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఆయన సోమవారం నాడు తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు.

English summary
Congress Hyderabad leader Danam Nagender clarified that he will continue in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X