పేదల ఇళ్లు కూల్చుతారా - దానం సంచలనం..!!

హైడ్రా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆక్రమణల పైన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తోంది. మూసీ పరీవాహక ప్రాంతాల్లోని స్లమ్ ప్రాంతాల్లో ఉన్న నివాసాలను అధికారులు మార్క్ చేసారు. స్థానికులు దీని పైన నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగానూ ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. తాజాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన దాని నాగేందర్ ఈ అంశం పైన సంచలన వ్యాఖ్యలు చేసారు.

నిరసనలు
హైడ్రా మూసీ పరీవాహక ప్రాంతంలోని ఆక్రమణల పైన ఫోకస్ చేసింది. ఇళ్లను గుర్తించి వాటికి మార్కింగ్ చేస్తున్నారు. దీని పైన స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వారిని ఉన్న ప్రదేశాల నుంచి తరలించటం పైన మండిపడుతున్నారు. మార్క్ చేసిన ఇళ్లల్లో ఉంటున్న వారికి డబుల్ బెడ్ రూమ్స్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. రెవిన్యూ అధికారులు వారితో చర్చలు చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఉంటున్న తమ నివాసాలను కూల్చటం ఏంటని వారి నిలదీస్తున్నారు.

Danam Nagender interesting comments over HYDRA demolitions at Musi River

సంచలన వ్యాఖ్యలు
ఈ వ్యవహారం రాజకీయంగానూ రచ్చగా మారింది. హైడ్రా, మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయించడంపై ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలు నివిసించే బస్తీల జోలికి హైడ్రా వెళ్లకూడదని ముందే చెప్పానని వెల్లడించారు. జలవిహార్‌, ఐమాక్స్‌ లాంటివి చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పేదల ఇళ్లను కూల్చడం సరికాదని.. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందంటూ దానం చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
స్లమ్ ఏరియాల్లోని నివాసాలు ఖాళీ చేయించాలంటే ముందు వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయించాల్సి ఉంటుందని దానం అభిప్రాయ పడ్డారు. ఇళ్లకు రెడ్ మార్క్ వేయటం..వారి నివాసాల గురించి సర్వే చేయించటం తొందరపాటు చర్యలుగా పేర్కొన్నారు. ఎప్పుడో డిసైడ్‌ చేసిన బఫర్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో.. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. కూల్చిన ఇళ్లకు అక్కడే నివాసం ఏర్పాటు చేస్తే మంచిదని పేర్కొన్నా ఎమ్మెల్యే దానం..ఈ అంశం పైన సీఎం రేవంత్ తో చర్చిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+