తేల్చేసిన దానం, స్పీకర్ కు లేఖ - ఇక నెక్స్ట్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. నిర్ణయం ఆలస్యం కావటంతో బీఆర్ఎస్ నేతలు సుప్రీంను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు సూచనల మేరకు స్పీకర్ మొత్తం పది మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురి పైన నిర్ణయం తీసుకున్నారు. వారు పార్టీ మారలేదని తేల్చేసారు. ఇక, మిగిలిన ముగ్గురిలో దానం నాగేందర్ తాజాగా స్పీకర్ కు లేఖ రాసారు. తన పార్టీ మార్పు వ్యవహారంతో పాటుగా అనర్హత పైన స్పష్టత ఇచ్చారు.
మాజీ మంత్రి దానం నాగేందర్ తాజాగా స్పీకర్ ప్రసాద్ కుమార్ కు లేఖ రాసారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన దానం పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం... 2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసారు. దీంతో.. దానం పైన ఫిర్యాదు రావటం తో వేటు తప్పదనే ప్రచారం సాగింది.

ఇదే సమయంలో దానం ముందుగానే రాజీనామా చేస్తారని అందరూ భావించారు. తాను రాజీనామాకు సిద్దమని.. సీఎం రేవంత్ చెబితే వెంటనే తాను రాజీనామా చేస్తానని దానం నాగేందర్ ప్రకటించారు. అయితే, అనర్హత ఫిర్యాదులు ఎదుర్కొంటున్న పది మందిలో ఏడుగురు పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ తేల్చేసారు. మిగిలిన ముగ్గురిలో దానం ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఇదే అంశం పైన సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.
దానం కాంగ్రెస్ నుంచి పోటీ చేసినట్లు అధికారికంగా ఆధారాలు ఉండటంతో.. వేటు తప్పదని, దీని ద్వారా ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక ఖాయమని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. దానం, కడియం తమకు స్పీకర్ నుంచి వచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలని కోరారు. ఇప్పుడు విషయం సుప్రీంకోర్టుకు చేరటంతో దానం నాగేందర్ తాజాగా స్పీకర్ కు లేఖ రాసారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని.. తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ ను కొట్టి వేయాలని ఆ లేఖలో కోరారు.
తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని.. తనను సస్పెండ్ చేసినట్లు సమాచారం లేదని చెప్పుకొచ్చారు. దీంతో, ఇప్పుడు దానం నాగేందర్ నుంచి వివరణ రూపంలో లేఖ రావటంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది. మున్సిపల్ ఎన్నికల పోరు సాగుతున్న వేళ.. దానం నాగేందర్ విషయంలో స్పీకర్ తుది నిర్ణయం పైన రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications