ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై దానం నాగేందర్ కీలక ప్రకటన..!!
రాజీనామాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఆయన స్పందించారు. రాజీనామాలు చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందని, ఎన్నికల్లో పోటీ చేయడం తనకు కొత్తేమీ కాదని చెప్పారు. అనర్హత వేటుపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని వివరించారు. రేవంత్ నాయకత్వం రాష్ట్రానికి అవసరం ఉందని చెప్పిన దానం.. రాజీనామా అంశం పైన తన వైఖరి ఏంటో తేల్చేసారు.
దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై కొంత కాలంగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని పార్టీ నేతలే చెప్పుకొచ్చారు. ఇప్పటికే అనర్హత పిటీషన్ పై విచారణ కోసం స్పీకర్ తాజాగా మరోసారి దానం కు నోటీసు జారీ చేసారు. ఇదే సమయంలో ఢిల్లీలో పార్టీ ముఖ్య నాయకత్వంతో దానం చర్చలు చేస్తున్నారు. రాజీనామాకు సిద్ధమేనంటూ కొన్ని అంశాల ను ప్రస్తావించారు. ఉప ఎన్నిక తరువాత కీలక పదవి పైనా దానంకు హామీ లభించినట్లు సమాచారం. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన దానం.. లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన పార్టీ మారినట్లుగా స్పష్టమైన ఆధారం ఉన్నట్లయింది.

దీంతో, తనపై విచారణ కొనసాగితే అనర్హత వేటు పడే అవకాశం ఉందని, అంతవరకూ వెళ్లకుండా తన పదవికి రాజీనామా చేయాలని దానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఇప్పుడు దానం తన రాజీనామా పైన స్పష్టత ఇచ్చారు. ఎమ్మెల్యే అనర్హత కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ ఉందని చెప్పుకొచ్చారు. స్పీకర్ దగ్గర కూడా అనర్హత పిటిషన్ పెండింగ్ లో ఉందని వివరించారు. రానున్న రోజుల్లో సందర్భాన్ని బట్టి రాజీనామా పై నిర్ణయం ఉంటుందన్నారు.
సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేసారు. ఎన్నికలు ఎదుర్కో వడం తనకు కొత్తకాదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయటం, గెలవటం తన రక్తంలోనే ఉందని దానం చెప్పుకొచ్చారు. తాను ఎన్నో ఎన్నికలు చూశానని.. ఎన్నో గెలిచానని వివరించారు. కాగా.. సీఎంగా రేవంత్ మరో పదేళ్లు కొనసాగినేతే అభివృద్ధి కొనసాగుతుందని దానం పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications