• search
  • Live TV
సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

డ్యాన్స్ నేర్పిస్తానని.. కొంప ముంచిన డ్యాన్స్ మాస్టర్

By Ramesh Babu
|

సిద్దిపేట: ఓ డ్యాన్స్ మాస్టర్.. డ్యాన్స్‌ నేర్పిస్తానని చెప్పి ఓ మైనర్‌ బాలికకు మాయమాటలు చెప్పి, ఆమెను లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. ఈ దారుణం సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది.

పట్టణంలోని కాళ్లకుంట కాలనీకి చెందిన మైనర్‌బాలిక (17) గత ఏడాది కాలంగా గాంధీ రోడ్‌లో ఉంటున్న సుమన్‌ అనే డ్యాన్స్‌ మాస్టర్‌ వద్ద డాన్స్‌ నేర్చుకుంటోంది. సిద్దిపేటతోపాటు ఇతర ప్రాంతాల్లో నృత్య ప్రదర్శనలకు సదరు బాలికను అతడు తీసుకెళ్లేవాడు.

girl-raped

డ్యాన్స్‌ నేర్పించే సాకుతో ఆ బాలికపై సుమన్ ఏడాది కాలంగా లైంగిక దాడికి దిగాడు. మాయమాటలు చెప్పి బలవంతంగా లోబర్చుకోని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో సదరు బాలిక గర్భం దాల్చింది.

దీంతో ఆమెకు అబార్షన్ చేయించేందుకు ఈ నెల 22న పట్టణంలోని న్యూలైఫ్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు రెండు ఇంజక్షన్‌లు సైతం చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అతడు అబార్షన్‌ చేయించే ప్రయత్నానికి ఒడిగట్టడాన్ని ఆ బాలిక పసిగట్టింది.

మొత్తం జరిగినదంతా తన తల్లిదండ్రులతో చెప్పడంతో విషయం కాస్తా వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తల్లిదండ్రులు సిద్దిపేట వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

డ్యాన్స్‌ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ఫోక్సో యాక్టు -సెక్షన్‌ 6 కింద కేసు నమోదు చేశారు. చివరికి తన వ్యవహారం పోలీసు ఠాణాకు చేరడంతో డ్యాన్స్ మాస్టర్ సుమన్ ప్లేటు ఫిరాయించాడు. ఇప్పటికిప్పుడు ఆ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతున్నాడు.

English summary
A dance master, Suman, who belongs to Gandhi Road in Siddipet Town raped a girl student who came to learn dance from him. When she got pregnency, Suman taken her to New Life Hospital for Abortion. Then the girl revealed total story infront of her parents and filed a case against him in Siddipet Town-1 police station. Police arrested dance master Suman under Section 6 of POCSO Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X