'దైకిన్'లో దండేపల్లి యువకుడికి భారీ వేతనం, తైక్వాండో కోచ్‌‌కు లైంగిక వేధింపులు

హైదరాబాద్: జపాన్‌కు చెందిన ప్రముఖ హార్డ్ వేర్ ఉత్పత్తుల కంపెనీ దైకిన్‌లో‌‌ దండేపల్లికి చెందిన యువకుడు భారీ వేతనంతో ఉద్యోగం సంపాదించాడు. ఢిల్లీ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి పంచాయతీ పరిధిలోని కర్ణపేటకు చెందిన అజ్మేరా సంకేత్ కుమార్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

Dandepally student get good package in japan company

ఇటీవల ఢిల్లీ ఐఐటీలో జరిగిన క్యాంపన్ నియామకాల్లో 20 మంది విద్యార్ధులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో భారత్ నుంచి మెకానికల్ విభాగం నుంచి సంకేత్‌కుమార్ ఒక్కడే ఎంపిక కావడం విశేషం. ఏడాదికి 30 లక్షల రూపాయల వేతనంతో ఆయనకు దైకిన్ కంపెనీ ఉద్యోగ ఆఫర్‌ను ఇచ్చింది.

వచ్చే ఏడాది మే, జూన్ నెలల్లో శిక్షణ అనంతరం ఆయన విధుల్లో చేరనున్నారు. సంకేత్‌కుమార్ తండ్రి ప్రేమ్‌సింగ్ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన శాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

నాగోల్‌లో తైక్వాండో కోచ్‌‌కు లైంగిక వేధింపులు

నగరంలోని నాగోల్‌లో తైక్వాండో కోచ్ వేధింపుల బారిన పడింది. ఇంటి ముందు మద్యం తాగవద్దని చెప్పినందుకు గాను పవన్‌, రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు తనను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ తైక్వాండో కోచ్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన ఎల్బీనగర్ పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+