మందుబాబులకు బ్యాడ్ న్యూస్..!
తెలుగు రాష్ట్రాల్లోని మందుబాబులకు ఇది ఒక చేదువార్త. సాధారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో దసరా అంటే ఓ కిక్కు. ఏ పండుగకు లేనంతగా దసరా పండుగకు జోష్ ఉంటుంది. దసరా రోజు చుక్కాముక్కా ఉండాల్సిందే. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతుంది. మందుతో పాటు మాంసం కూడా తప్పనిసరి మరి. కానీ ఈ సారి దసరాకు చుక్కా ముక్కపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు వచ్చాయి. ఈ క్రమంలోనే మద్యం, మాంసం విక్రయాలపై చర్చ నడుస్తోంది.
అయితే సాధారణంగా గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం దుకాణాలు మూసివేస్తారు. అంటే గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా డ్రై డే పాటించడం ఆనవాయితీ. అయితే దసరా రోజున చాలా మందికి సుక్కా ముక్కా లేకపోతే ముద్ద దిగదు. అందుకోసం అక్టోబర్ 2న మద్యం, మాంసం విక్రయాలపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. అక్టోబర్ 2న మద్యం, మాంసం దుకాణాలను మూసివేయాలా లేదా మినహాయింపు ఇవ్వాలా అనే దానిపై అధికారులు చర్చోపచర్చలు జరుపుతున్నారు.

ఒకవేళ దసరా పండుగను సుక్కాముక్కాతో జరుపుకోవాలనుకునేవారు, అలాగే సాధారణంగా మద్యం సేవించేవారు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం షాపులతో పాటు, బార్‌లు, పబ్‌లు కూడా మూసివేయబడతాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. అందువల్ల, దసరా రోజు మద్యం సేవించాలనుకునేవారు తమ అవసరాలకు తగ్గట్లుగా ముందుగానే కొనుగోలు చేసుకోవడం మంచిది.
గతేడాది దసరాకు కిక్కే కిక్కు..
గతేడాది దసరా పండుగకు తెలంగాణ రాష్ట్ర ఖజానాకు రూ.1285 కోట్లు వచ్చి చేరాయి. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని గతేడాది అక్టోబర్ 1 నుంచి 14 వరకు .. 11 రోజుల్లో ఎక్సైజ్ శాఖకు డబ్బుల వర్షం కురిసింది. ఏకంగా రూ.1285.16 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇలా జరిగితే రాష్ట్ర ఖజానాకు కూడా గండి పడే అవకాశం లేదు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications