పెరిగిన సైబర్ కీచకులు: ఫేస్‌బుక్ చాటింగ్‌తో మహిళలకు వేధింపులు, బ్లాక్ మెయిల్

హైదరాబాద్: ఇంటర్నెట్ ప్రపంచ గతినే మార్చేసిన ఓ సాధనం. అలాంటి ఇంటర్నెట్‌ను కొంత మంది మంచికి ఉపయోగించుకుంటే, మరికొందరు చెడుకు ఉపయోగించుకుంటున్నారు. తాజాగా నగరంలో ఫేస్‌బుక్, ఇంటర్నెట్ ఆన్‌లైన్ చాటింగ్‌తో మహిళలను వేధిస్తున్న సైబర్ నేరగాళ్లు పెచ్చుమీరుతున్నారు.

నాలుగు నెలల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 50కి పైగా కేసులు నమోదవుతున్నాయంటే సైబర్ నేరగాళ్లు ఏ రేంజ్‌లో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారో అర్ధమవుతోంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువతుల ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడిన హైదరాబాదీ అబ్దుల్ మజీద్ (21) గతేడాది 200 మంది యువతులను లోబరుచుకుని జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

అంతక ముందు ఏడాది పాటు జైలు జీవితం గడిపిన మజీద్ వ్యసనాలకు బానిసై యువతులను బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో అతనిపై ఏడు కేసులు నమోదయ్యాయి. కాగా బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న వారంతా 21 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న అమ్మాయిలే కావడం విశేషం.

 Data shows significant rise in cyber crime in Hyderabad

తాజాగా విశాఖపట్నం, గుంటూరు, పానిపట్, బెంగుళూరు నుంచి ఆన్‌లైన్ చాటింగ్ ద్వారా బ్లాక్‌మెయిల్ చేస్తున్న సుమారు 50మందికి పైగా సైబర్ నేరగాళ్లను గుర్తించినట్టు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. గతేడాది 12 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది నమోదైన కేసుల్లో 10 కేసులను తీవ్ర నేరాలుగా పరిగణించబడే విధంగా ఉన్నాయన్నారు.

కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే 50కి పైగా కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. గుంటూరుకు చెందిన ఓ యువతి ఫేస్‌ను మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్న యువకులను గుర్తించేందుకు ఓ టీమ్‌ను గుంటూరుకు పంపించినట్టు సైబర్ క్రైం ఏసీపీ రఘువీర్ తెలిపారు.

పరువుపోతుందని కొందరు యువతులు ఫిర్యాదులు చేయడం లేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీపీ వివరించారు. వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో మహిళలు, యువతులు తమ ఫోటోలు, వివరాలను పంపవద్దని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+