తల్లి కన్నీరుమున్నీరు: టెక్కీగా అత్తకు డబ్బులిచ్చిన సారిక, అసలేం జరిగింది!?

వరంగల్: సారిక, ముగ్గురు పిల్లల మృతి విషయం తెలియగానే బుధవారం ఉదయం సారిక తల్లి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. సారిక మృతి విషయం తెలియడంతో ఆమె తల్లిగారి ఊరు అయిన నిజామాబాద్ జిల్లా వడ్లూరి ఎల్లారెడ్డిలో విషాదం నెలకొంది.

తన కూతురు వద్దకు ఆరేళ్లుగా భర్త రావడం లేదన, ముగ్గురు పిల్లలను పెంచడం తన కూతురు సారికకు కష్టంగా మారిందని తల్లి లలిత కన్నీరుమున్నీరు అయ్యారు.

సారిక పరిస్థితి తెలిసి తండ్రి మంచాన పడ్డారన్నారు. సారిక దసరాకు తమ ఇంటికి వచ్చి వెళ్లిందన్నారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె సోదరి చెప్పారు. రాజయ్య కుటుంబమే చంపిందన్నారు.

సారిక వద్దకు రాజయ్య ఎందుకు వచ్చారు?

సారిక, రాజయ్య కుటుంబ సభ్యులు వేర్వేరుగా ఉంటున్నారు. మంగళవారం రాత్రి రాజయ్య.. సారిక వద్దకు వచ్చారని చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితం సారిక... రాజయ్యకు టిక్కెట్ ఇవ్వవద్దని ఏఐసీసీకి లేఖ రాశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఆరా తీసేందుకే ఆయన వచ్చి ఉంటారని అంటున్నారు.

Daughter in law, three grandchildren Killed: Mother alleged Rajaiah's family

అసలేం జరిగింది?

నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన సారిక, మాజీ ఎంపి రాజయ్య కొడుకు అనిల్‌లు తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సారిక సాఫ్టువేర్ ఇంజినీర్‌‍గా పని చేసేవారు. లండన్ వెళ్లిన ఆమె 2005లో తిరిగి వచ్చారు. 2002 నుంచి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత 2006లో అనిల్‌తో వివాహం జరిగింది.

కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత తన భర్త అనిల్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని సారిక తెలుసుకుందని తెలుస్తోంది. దీనిపై భర్తను నిలదీశారు. అప్పటి నుంచి గొడవలు ప్రారంభమయ్యాయని సమాచారం. పెళ్లయ్యాక కూడా ఆమె ఉద్యోగం చేశారు. టెక్కీగా పని చేసిన డబ్బులు అత్తకిచ్చినట్లు చెప్పారు.

అనిల్ - సారికలు చిలకలగూడలో కాపురం పెట్టారు. అనిల్ వేరే యువతితో సంబంధం కొనసాగిస్తున్నాడని భావించిన సారిక వరంగల్లోని అత్తింటికి వచ్చింది. అత్తమామలు కూడా కొడుకుకే మద్దతు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు.

తనకు పిల్లల భవిష్యత్తు భారంగా మారిందని, తనను ఆదరించడం లేదని ఆమె ఆరోపించారు. 2014లో నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బేగంపేట మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదయింది.

ఓసారి ఆమె ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో ఆమె రాజయ్య ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పారు.

మొదట్లో తన భర్త, అత్తామామలం సఖ్యతతోనే ఉండేవారమని, ఆ తర్వాత మానసికంగా వేధించారని, సాఫ్టువేర్ ఉద్యోగిగా సంపాదించిన సొమ్ము అత్తకు ఇచ్చానని, తన ముగ్గురు పిల్లలను పోషించడం కష్టంగా మారిందని సారిక పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారని చెబుతున్నారు.

తన మామ రాజయ్య ఎంపీ అయ్యాకే తనకు వేధింపులు మొదలయ్యాయని సారిక గతంలో ఆరోపించారు. ఇప్పుడు రాజయ్య కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నేపథ్యంలో.. సారిక, పిల్లలు మృతి చెందడం గమనార్హం.

సారిక గతంలో మాట్లాడిన మాటలను ఓ టీవీ ఛానల్ ప్రసారం చేసింది. తన భర్తతో పాటు అత్తామామలు తనను, తన పిల్లలను పట్టించుకోవడం లేదని సారిక ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో అనిల్‌తో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారిందని, 2006లో తామిద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిపారు.

ఆ తర్వాత పుణేలోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో తాను టెక్కీగా పని చేశానని ఆమె తెలిపారు. ఆ సమయంలోనే తనకు పెద్ద కుమారుడు పుట్టాడని, అనంతరం తనకు హైదరాబాదులోని ఐబీఎం కంపెనీలో ఉద్యోగం రాగా ఇల్లు తీసుకున్నానని చెప్పారు.

ఈ సమయంలో ఏడాదిన్నరగా తన వద్దకు తన అత్తామామలు అసలే రాలేదని వాపోయారు. తనను కాకున్నా తన కుమారుడిని అయినా చూసేందుకు వారు రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన అత్తపై తీవ్ర ఆరోపణలు చేశారు. వేధింపుల్లో తన అత్త సూర్యాకాంతాన్ని మించిపోయారని ఆరోపించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న కొడుకును మందలించాల్సిన బాధ్యతను మరిచి అతడిని ప్రోత్సహించిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+