హైదరాబాద్ లో 120 ఏళ్ల హోటల్.. ఉదయం 5 గంటల నుంచే క్యూ.. ఎక్కడంటే..?
హైదరాబాద్ మహా నగరం స్ట్రీట్ ఫుడ్ కు పెట్టింది పేరు. నిజాం కాలం నాటి రుచుల నుంచి నేటి వరకూ ఎన్నో రకాల ఆహార పదార్థాలకు, బిర్యానీలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. హైదరాబాద్ వీధుల్లో ఎన్నో రకాల ఫుడ్ ఐటెమ్స్ మనకు కనిపిస్తుంటాయి. నిజాం కాలం నాటి నుంచీ కూడా ఉస్మానియా బిస్కెట్స్, హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ ఛాయ్.. లాంటివి ఫేమస్ గా నిలుస్తున్నాయి. అయితే హైదరాబాద్ లో పురాతన రెస్టారెంట్లు, హోటళ్లు చాలానే ఉన్నాయి. హైదరాబాద్ లోని హుస్సేనీ అలామ్ లైన్ లోని మూసాభాయ్ నిహారీ పాయాకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు.
హుస్సేనీ అలామ్ ప్రాంతంలోని మూసాభాయ్ నిహారీ పాయాకు 120 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఉదయం 5 గంటల నుంచే ఈ హోటల్ వద్ద భారీగా జనం గుమికూడి ఉంటారు. ఇక్కడి నల్లీ నిహారీని ఇష్టపడని వారుండరు. ఈ హోటల్ కు ఎలాంటి సైన్ బోర్డు కూడా ఉండదు. హోటల్ వద్ద జనాలు కూర్చోడానికి కొన్ని బెంచీలు.. అలాగే కౌంటర్ ఉంటుంది. ఇక్కడి ఫుడ్ కోసం మాత్రమే జనాలు వస్తుంటారు. హోటల్ గ్రాండ్ గా ఉందా లేదా అని పట్టించుకోరు.

ఈ హోటల్ లో నిహారీని కట్టెల పొయ్యిపై మండిస్తారు. మాంసం సాఫ్ట్ గా, రుచికరంగా ఉడికేంత వరకూ కట్టెల పొయ్యిపైనే వేడి చేస్తారు. ఈ హోటల్ లో ఆయిల్, స్పైసెస్ , మసాలాను తక్కువగా వినియోగిస్తారు. అదే ఇక్కడి స్పెషల్. అలాగే ఇక్కడ బ్రెడ్ కానీ నాన్ గానీ వడ్డించరు. హోటల్ కు వచ్చేవాళ్లు బ్రెడ్ లేదా నాన్ వారి వెంటే తెచ్చుకుంటారు. నహారీ మాత్రమే ఇక్కడ లభిస్తుంది. ఈ హోటల్ కు 120 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రస్తుతం ఐదో తరానికి చెందిన వాళ్లు ఈ హోటల్ ను నడుపుతున్నారు.












Click it and Unblock the Notifications