హైదరాబాద్ టూ దుబాయ్ టూర్.. తక్కువ ధరకే IRCTC సూపర్ ఆఫర్..
ఇటీవలి కాలంలో యువత, ఉద్యోగులు టూరిజం బాట పడుతున్నారు. ఒత్తిడి లైఫ్, ఉరుకులు పరుగుల జీవితం కారణంగా కాంక్రీట్ లైఫ్ ను కొద్దిసేపు పక్కన పెట్టి అలా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో విహారయాత్రలకు వెళ్తున్నారు. వీకెండ్ టూరిజం కూడా క్రమంగా పెరుగుతోంది. వీక్ మొత్తం వర్క్ లో బిజీగా గడిపి వీకెండ్ లో ఏదైనా టూరిస్ట్ ప్రాంతానికి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అలాంటి వారికోసం ఐఆర్‌సీటీసీ ఎప్పటికప్పుడు బెస్ట్ టూరిస్ట్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పుడు సంక్రాంతి సెలవులు కావడంతో దుబాయ్ టూర్ తీసుకొచ్చింది. తక్కువ ధరకే దుబాయ్ టూర్ చేసే విధంగా ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది.
"ది స్పెండర్స్ ఆఫ్ దుబాయ్" పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్‌సీటీసీ. ఇందులో భాగంగా హైదరాబాద్, ముంబై, దిల్లీ, బెంగళూరు నుండి దుబాయ్, అబూ ధాబీకి స్పెషల్ టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఈ టూర్ 23 నుంచి 27 వరకు కొనసాగుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ఫ్లైట్స్, హోటళ్లు, లోకల్ ట్రావెల్, భోజనాలు అన్నీ ఇందులోనే సమకూర్చింది. మొత్తం నాలుగు రాత్రులు, ఐదు పగళ్లు ఈ టూర్ సాగుతుంది. హైదరాబాద్ నుంచి విమానంలో ఈ విహార యాత్ర సాగుతుంది.
ఇక దుబాయ్ టూర్ లో భాగంగా.. జనవరి 23న ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయర్ పోర్ట్ నుంచి విమానం స్టార్ట్ అవుతుంది. అలా రెండున్నర గంటల పాటు ప్రయాణం తర్వాత విమానం దుబాయ్ చేరుకుంటుంది. ఎయిర్ పోర్టు నుంచి బుక్ చేసిన హోటల్ కు తీసుకెళ్తారు. అక్కడే ఆహారం తీసుకుని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం దుబాయి మెరీనాలోని దో క్రూయిజ్ ను సందర్శిస్తారు. రాత్రికి అక్కడే హోటల్ లో స్టే చేస్తారు.
ఇక రెండో రోజు వీల్ ఐన్ దుబాయ్ తో పాటుగా నగరాన్ని సందర్శిస్తారు. ఇండియన్ రెస్టారెంట్ లో లంచ్ చేసి.. డెజర్ట్ సఫారీ ని ఎంజాయ్ చేస్తారు. అలా సాయంత్రానికి తిరిగి హోటల్ చేరుకుంటారు. మూడో రోజు గ్లోబల్ విలేజ్, మిరాకిల్ గార్డెన్ ను సందర్శిస్తారు. ఆ తర్వాత బుర్జ్ ఖలీఫా.. రాత్రికి లైటింగ్ షో ను వీక్షిస్తారు.

ఇక నాలుగో రోజు అబుదాబిలోని హిందూ టెంపుల్ సందర్శన, ఫెర్రారీ వరల్డ్ ఫొటోషూట్ ఉంటుంది. ఇక చివరి రోజు దుబాయ్ ఫ్రేమ్ చూసుకుని రాత్రి తిరిగి శంషాబాద్ కు విమానం బయల్దేరుతుంది.ఈ టూర్ వెళ్లేవారికి తప్పనిసరిగా పాస్ పోర్టు ఉండాలి. అలాగే వీసా కోసం కొన్ని ధ్రువీకరణ పత్రాలు కూడా వెంట ఉంచుకోవాలి. ఇక ఈ దుబాయ్ ట్రిప్ కు టికెట్ ధర రూ.1,12,000 నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాల కోసం అధికారిక IRCTC వెబ్ సైట్ ను సందర్శించండి.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications