TSRTC Strike: చివరి అవకాశం: నవంబర్ 5 డెడ్‌లైన్, కేసీఆర్ కీలక నిర్ణయాలు

హైదరాబాద్: తెలంగాణ అన్నా.. తెలంగాణ ప్రజలు అన్నా తనకు అమితమైన ప్రేమ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 49 అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏను మంజూరు చేసినట్లు తెలిపారు. కొత్త మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి రూ. 970 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.

దురంహంకార పూరితంగా సమ్మె.. 5100 రూట్లు ప్రైవేటుకే

దురంహంకార పూరితంగా సమ్మె.. 5100 రూట్లు ప్రైవేటుకే

తెలంగాణ ప్రజల కోసమే తమ నిర్ణయాలుంటాయని సీఎం కేసీఆర్ చెప్పారు. తాను రవాణా శాఖ మంత్రిగా చేసిన అనుభవంతోనే మార్పులు చేస్తున్నామని అన్నారు. 5100 బస్సులను ప్రైవేటు వాళ్లకు రూట్ పర్మిట్లు ఇస్తామని తెలిపారు. ఆర్టీసీ యూనియన్లు అనాలోచితంగా.. అర్ధరహితంగా. దురంహంకార పూరితంగా సమ్మెకు పోయారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేయడం సరికాదని, అది ఎన్నో విపరిణామాలకు దారితీస్తుందన్నారు. విలీనం చేయకూడదని కేబినెట్ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.

విలీనం ప్రశ్నే లేదు..

విలీనం ప్రశ్నే లేదు..

ఆర్టీసీని విలీనం చేయడమనే ప్రశ్నే ఉత్పన్నం కాదని కేసీఆర్ తేల్చి చెప్పారు. బ్లాక్ మెయిల్ విధానం ఉండకూదని, స్టేట్ ఇమేజ్ దెబ్బతినకూడదనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. మొత్తం 10400 బస్సుల్లో 2100 బస్సులు అద్దెకు తీసుకున్నవని చెప్పారు. మిగిలిన 8300లలో 2600 బస్సులను తీసేసి కొత్త బస్సులను ప్రవేశపెట్టాల్సి ఉందన్నారు. 5100 రూట్ పర్మిట్లను ప్రైవేటు వాళ్లకు ఇస్తున్నామని చెప్పారు. కొత్త బస్సులను ఆర్టీసీ కొనగలిగే పరిస్థితి లేదని అన్నారు. తప్పని పరిస్థితిలోనే ఈ రూట్లను ప్రైవేటు వాళ్లకు ఇస్తున్నట్లు తెలిపారు.

డెడ్‌లైన్‌లోగా చేరండి..

డెడ్‌లైన్‌లోగా చేరండి..

నవంబర్ 5 అర్ధరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. చేరినవారి ఉద్యోగాలకు రక్షణ ఉంటుందని తెలిపారు. చేరని వారి గురించి తమకు అవసరం లేదని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు, కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే తాము ఈ అవకాశం ఇస్తున్నామని చెప్పారు. యూనియన్టలు, ప్రతిపక్షాల మాయలో పడి ఉద్యోగాలు కోల్పోవద్దని, కార్మికులు తమ కుటుంబాలను రోడ్డున పడేయకూడదని సూచించారు. ఆర్టీసీ కార్మికులు తమ బిడ్డలేనని, వారి గురించి ఆలోచించే ఈ అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.

సమ్మె ఇల్లీగల్.. సంస్థతో సంబంధాలు తెగిపోయాయి..

సమ్మె ఇల్లీగల్.. సంస్థతో సంబంధాలు తెగిపోయాయి..

సమ్మెకు వెళ్లొద్దని చెప్పామని.. కమిటీ కూడా నియమించామని.. అయినా కార్మికులు సమ్మెకు వెళ్లారని కేసీఆర్ తెలిపారు. చర్చలు జరుపుతున్న సమయంలోనే కార్మికులు సమ్మెకు దిగారని అన్నారు. అందువల్లే కార్మిక శాఖ ఈ సమ్మెను ఇల్లీగల్ అని స్పష్టం చేసిందన్నారు. ఇల్లీగల్ సమ్మె చేసేందుకు సిద్ధపడినప్పుడే.. ఉద్యోగులతో సంస్థకు సంబంధాలు తెగిపోయాయని అన్నారు. ప్రతిపక్షాల పిచ్చి మాటలు పట్టుకుని సమ్మెకు దిగారని మండిపడ్డారు. ఇంకా కార్యాచరణ అంటూ ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ.. బ్లాక్ మెయిలింగ్

ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ.. బ్లాక్ మెయిలింగ్

సమ్మె కారణంగా 49వేల మంది కార్మికులు రోడ్డునపడుతున్నారన్నారు కేసీఆర్. సమ్మె వల్ల పండగ సందర్భంలో రావాల్సిన అదనపు ఆదాయాన్ని సంస్థ కోల్పోయిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని డిమాండ్లను ఆర్టీసీ యూనియన్లు చేస్తున్నాయన్నారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లో ఆర్టీసీ లేదని, ఉన్నా బస్సులు వందల్లోనే ఉన్నాయన్నారు.

అవకాశాన్ని వినియోగించుకోండి..

అవకాశాన్ని వినియోగించుకోండి..

కార్మికులకు ఈ సందర్భంగా మరో అవకాశం ఇస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. నవంబర్ 5లోగా విధుల్లో చేరితేనే ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం తప్పించుకుంటారని తెలిపారు. కాదు కూడదు అంటే సహించే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. లాభాలు వచ్చే రూట్లనే ఆర్టీసీకి కేటాయిస్తామని ఈ సందర్భంగా సీఎం అన్నారు. నష్టాలొచ్చే రూట్లను ప్రైవేట్‌కు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే మిగితా కార్పోరేషన్లు కూడా అదే డిమాండ్‌తో సమస్యలు సృష్టిస్తాయని కేసీఆర్ అన్నారు. ప్రైవేటు బస్సులకు పర్మిట్ ఇచ్చే విధానం దేశమంతా ఒక్కటే అని సీఎం తెలిపారు. ప్రైవేట్ వాళ్లు చార్జీలు పెంచకుండా సర్కార్ కంట్రోల్ చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు. పండుగల సందర్భంగా అసౌకర్యం కలగకుండా ఉండాలనే 50-50 లెవల్ ప్లే విధానంలోనే పర్మిట్లు ఇస్తున్నామని సీఎం తెలిపారు. ప్రస్తుతం ఏయే పాసులు అమల్లో ఉన్నాయో అవన్నీ చెల్లుతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆర్టీసీ కార్మికులు పునరాలించుకోవాలని సీఎం కార్మికులకు సూచించారు. వారు ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలని సీఎం అన్నారు. యూనియన్ల మాట విని తమ కుటుంబాలను బజారున పడేసుకోవద్దని సీఎం కేసీఆర్ కార్మికులకు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+