చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతులు వీళ్లే
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 20 మందికిపైగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ ల ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఈ తెల్లవారు జామున జిల్లాలోని చేవెళ్ల సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తోన్న టీజీఎస్ఆర్టీసీ బస్సు నంబర్ టీఎస్ 34 టీఏ 6354 ఎక్స్ ప్రెస్ బస్సు మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. ఖానాపూర్ గేట్- మీర్జాగూడ సమీపంలో రాంగ్ రూట్ లో వచ్చిన నంబర్ టీజీ 06 టీ 3879 భారీ టిప్పర్ బస్సును వేగంగా ఢీకొట్టింది. కంకర లోడ్ తో వెళ్తోన్న టిప్పర్ అది. టిప్పర్ ఢీ కొట్టిన వేగానికి బస్సు కుడి వైపు భాగం మొత్తం కోసుకుపోయింది. బస్సు ముందు భాగం, డ్రైవర్ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. ప్రయాణికులను వెలికి తీయడానికి శ్రమించాల్సి వచ్చింది.

మరణించిన వారిలో..
1. దాస్యం నాగమణి- బన్నూరు, సేడం మండలం, గుల్బర్గా, కర్ణాటక
2. తారాబాయి- శ్రీరామ్ నగర్ తండా, వికారాబాద్
3. తబస్సుమ్ జహా- తాండూరు
4. గుర్రాల అఖిల- లక్ష్మీనగర్ పూర్, యాలాల మండలం, తాండూరు
5. పనుగుల కల్పన- బోరబండ, హైదరాబాద్
6. నల్లగండ్ల హనుమంతు- దౌల్తాబాద్
7. గొగుల గుణమ్మ- బోరబండ, హైదరాబాద్
8. షేక్ ఖాలద్ హుస్సేన్- తాండూరు
9. తాలియా బేగం- తాండూరు
10. 10 నెలల చిన్నారి పాప
11. నందిని- తాండూరు
12. సాయి ప్రియ- తాండూరు
13. తనూష- తాండూరు
14. ముస్కాన్- తాండూరు
15. పీహెచ్బీ డ్రైవర్ దస్తగిరి (బ్యాడ్జి నంబర్ 6006)- మంథట్టి గ్రామం, బషీరాబాద్ మండలం, వికారాబాద్
16. కమ్లే ఆకాష్- టిప్పర్ డ్రైవర్, మహారాష్ట్ర
17. కందుగుంట బండప్ప- హాజీపురా గ్రామం, యాలాల మండలం, వికారాబాద్
వికారాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లు..
సౌమ్య - కిషన్ బాగ్, హైదరాబాద్.
అబ్దుల్లా- కిషన్ బాగ్, హైదరాబాద్
ఆస్మా- కిషన్ బాగ్, హైదరాబాద్,
ప్రవీణ బీ- జల్సేపల్లి, తాండూరు
బీ స్వప్న- కామారెడ్డి, వికారాబాద్
లక్ష్మణ్- అప్పాజిపల్లి, ముథూర్ మండలం
సోమయ్య- గ్రీన్ సిటీ, తాండూరు
థసుర- కిషన్ బాగ్, హైదరాబాద్
ఆస్మా సయ్యద్- కిషన్ బాగ్, హైదరాబాద్
షఫీ- బహదూర్ పురా- హైదరాబాద్.
పీఎంఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లు..
చాకలి శ్రీ సాయి- తాండూరు.
కుమ్మరి అనదూయ- గొంగుపల్లి, పూడూరు మండలం, వికారాబాద్
వెంకటేష్ (హెడ్ కానిస్టేబుల్)- వికారాబాద్
రేబరిబోని నందిని- దరూర్, వికారాబాద్
జగదీష్- వీరారెడ్డిపల్లి, తాండూరు మండలం
బుజ్జి బాయి- రామ్ నగర్ కాలనీ, ఘనారం తండా, వికారాబాద్
నాగమణి- భారూర్, వికారాబాద్
బసవరాజు- కోకట్ గ్రామం, యాలాల మండలం, వికారాబాద్
బీ శ్రీనివాస్- తాండూరు, వికారాబాద్
అబ్దుల్ మాజిద్- తాండూరు, వికారాబాద్
అకిల్ ఖాన్- వికారాబాద్,
దయాకర్- వికారాబాద్
రాధా (బస్ కండక్టర్)- తాండూరు
అబ్దుల్ రజాక్- హసన్ నగర్, శివరాంపల్లి, రంగారెడ్డి












Click it and Unblock the Notifications