కవిత కేసుపై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్
K Kavitha: సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు లభించట్లేదు. ఆమె ఇబ్బందులు మరింత పెరిగాయి. ఒకవంక- బెయిల్ కోసం ఆమె ప్రయత్నాలు సాగిస్తోండగా.. మరోవంక కొత్తగా సప్లిమెంటరీ ఛార్జిషీట్ సైతం దాఖలైంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెపై కొత్తగా ఈ సప్లిమెంట్ ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో కవితతో పాటు మరో నలుగురి పేరునూ చేర్చారు. ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురు- దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, ఛన్‌ప్రీత్ సింగ్, అరవింద్ సింగ్‌పై గతంలోనే ఛార్జిషీట్ దాఖలైంది. సప్లిమెంటరీలోనూ వారి పేర్లు నమోదయ్యాయి.

సప్లిమెంటరీని పరిగణనలోకి తీసుకుంటే- ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో మొత్తం మీద ఇది ఎనిమిది ఛార్జ్‌షీట్లు దాఖలయ్యాయి. ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో తొలిసారిగా మార్చి 15వ తేదీన అరెస్టయ్యారు కవిత. అప్పట్లో ఆమెపై ఈడీ అధికారులు ఛార్జ్‌షీట్ నమోదు చేశారు.
60 రోజుల్లోపల నిందితులకు శిక్ష పడకపోతే మళ్లీ కొత్త ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల 15వ తేదీ నాటికి దీని కాల వ్యవధి ముగిసినందున అంతకంటే ముందే కొత్తగా ఛార్జ్‌షీట్ పెట్టారు. తాజాగా దానికి అనుబంధ ఛార్జిషీట్‌ను జాత చేశారు. దీనిపై తాజాగా ఢిల్లీ హైకోర్టు వాదనలను ఆలకించింది. కవిత, ఈడీ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
కాగ్నిజెన్స్ పాయింట్ కింద ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. సప్లిమెంటరీ ఛార్జిషీట్‌పై ఈ నెల 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఎలాంటి తీర్పు వెలువడుతుందనేది చర్చనీయాంశమైంది. మరోవంక- ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీపై దాఖలైన అనుబంధ ఛార్జిషీట్‌ను మే 28వ తేదీన విచారించాలని కోర్టు నిర్ణయించింది. ఆ రోజున దీనికి సంబంధించిన పిటీషన్లను లిస్టింగ్ చేసింది.












Click it and Unblock the Notifications