Delhi Liquor Scam: కవిత పిటీషన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!!

ఎమ్మెల్సీ కవిత అభ్యర్థనను సుప్రీం తిరస్కరించింది. ఈనెల 24నే విచారిస్తామని ఉన్నతన్యాయస్థానం తేల్చిచెప్పింది.

ఎమ్మెల్సీ కవిత అభ్యర్ధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కవిత..ఈ నెల 20న విచారణకు రావాలంటూ నోటీసులు అందుకున్నారు. దీంతో..ఇప్పటికే సుప్రీంలో దాఖలు చేసిన కేసు విచారణ ఈ నెల 24న ఉండటంతో.. ముందుగానే తన పిటీషన్ విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు పిటీషన్ దాఖలు చేసారు. పరిశీలించిన సుప్రీంకోర్టు తాము ఇప్పటికే నిర్ణయించిన విధంగా 24నే విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో..ఇప్పుడు కవిత తదుపరి అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఒక విడత ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో విచారణకు సంబంధించి పిటీషన్ దాఖలు చేసారు. గతంలో మహిళల విచారణ సమయంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల అమలు గురించి కవిత ప్రస్తావన చేస్తున్నారు. గురువారం ఈడీ విచారణకు హాజరు కావాల్సిన కవిత ఒక లేఖ రాసారు. తన లాయర్లు..ప్రతినిధుల ద్వారా ఈడీకి పంపారు. అందులో మహిళల విచారణ సమయంలో ఎలా వ్యవహరించాలనే సుప్రీం గైడ్ లైన్స్ ను వివరించారు. తాను ఇప్పటికే ఈ అంశం పైన సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసానని..కోర్టు నిర్ణయం వెలువడే వరకూ విచారణ వాయిదా వేయాలని కవిత కోరారు. ఈ లేఖను పరిశీలించిన ఈడీ ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు తాజాగా సమన్లు జారీ చేసారు.

Delhi Liquor scam: Supreme court dismisses MLC kavithas petition over ED enquiry, deets here

తన లేఖను పరిగణలోకి తీసుకోకుండా ఈడీ మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వటంతో సుప్రీంలో తన పిటీషన్ విచారణ కోసం కవిత అభ్యర్ధించారు. అయితే, సుప్రీంకోర్టు 24నే విచారణ ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. దీంతో, ఈ నెల 20న కవిత విచారణకు హాజరవుతారా..లేక, ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. తాజాగా ఈడీ కోర్టులో విచారణ అధికారులు రామచంద్ర పిళ్లైను ప్రవేశ పెట్టిన సమయంలో కీలక అంశాలను ప్రస్తావించారు. మార్చి 20న ఉదయమే కవిత-అరుణ్‌ పిళ్లైల మధ్య ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి విచారించాల్సి ఉందని..కవిత హాజరు కాలేదని వివరించారు. ఇక, అటు న్యాయ పోరాటం చేస్తున్న కవితకు ఈ నెల 24 లోగా విచారణకు అవకాశం లేదని స్పష్టం అవుతోంది. దీంతో..ఈ నెల 20న కవిత మరోసారి ఈడీ ముందు హాజరు అంశం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+