గద్వాల మెడికో శ్రీకాంత్‌గౌడ్‌ను కిడ్నాపర్ చెరనుండి రక్షించిన పోలీసులు

ఈ నెల 6వ, తేదిన కిడ్నాప్‌కు గురైన గద్వాలకు చెందిన మెడికో శ్రీకాంత్‌‌గౌడ్ సురక్షితంగా కిడ్నాపర్ల నుండి విడుదలయ్యారు. శ్రీకాంత్‌గౌడ్ కుటుంబసభ్యులతో మాట్లాడారు.

న్యూఢిల్లీ: ఈ నెల 6వ, తేదిన కిడ్నాప్‌కు గురైన గద్వాలకు చెందిన మెడికో శ్రీకాంత్‌‌గౌడ్ సురక్షితంగా కిడ్నాపర్ల నుండి విడుదలయ్యారు. శ్రీకాంత్‌గౌడ్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. కిడ్నాపర్ల నుండి శ్రీకాంత్‌ను పోలీసులు సుమారు 13 రోజుల తర్వాత రక్షించారు.

తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల పట్టణానికి చెందిన అక్కల శ్రీకాంత్‌గౌడ్‌ ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. అయితే రోజువారీగానే విధులకు హజరయ్యేందుకు ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకొన్నాడు శ్రీకాంత్. అయితే ఈ నెల 6వ,తేదిన ఆయనను ఓలా క్యాబ్ ‌డ్రైవర్ కిడ్నాప్ చేశాడు.

Delhi police rescues medico Srikanth goud

అయితే కిడ్నాపర్ వ్యూహాత్మకంగా వ్యవహరించాడు.తనకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలను ఆయన ఓలా కార్యాలయంలో ఇవ్వలేదు. తప్పుడు ధృవీకరణ పత్రాలను ఆయన సమర్పించాడు.

కిడ్నాప్ చేయాలని ప్లాన్ వేసుకొని ప్రోఫెషనల్‌ను కిడ్నాప్ చేయాలని నిందితుడు ప్లాన్ చేశాడు. అయితే దురదృష్టవశాత్తు శ్రీకాంత్ ఓలా క్యాబ్ ను బుక్ చేశాడు. దీంతో అతడిని నిందితుడు కిడ్నాప్ చేశాడు.

అయితే శ్రీకాంత్‌ను విడుదల చేయాలంటే రూ5 కోట్లు ఇవ్వాలని నిందితుడు శ్రీకాంత్ కుటుంబసభ్యులను డిమాండ్ చేశారు.ఈ కేసును విచారణ చేసేందుకుగాను తెలంగాణ రాష్ట్రం నుండి ప్రత్యేకంగా ఏసీపీ రాహుల్ వెళ్ళాడు. ఢిల్లీ పోలీసుల సహకారంతో సురక్షితంగా శ్రీకాంత్‌ను రక్షించారు.

మీడియా ముందు గురువారం నాడు నిందితుడిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. శ్రీకాంత్ తన కుటుంబసభ్యులతో మాట్లాడించారు పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+