చిల్లర ఉన్నవాడే శ్రీమంతుడు: పది శాతం కమిషన్‌తో చిల్లర
హైదరాబాద్: రూ.500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో చిల్లర ఉన్నవాడే శ్రీమంతుడయ్యాడు. దేశవ్యాప్తంగా చిల్లర నోట్లకు కొరత ఏర్పడింది. ప్రతి చోటా ప్రజలు ఐదు వందలు, వేయి రూపాయల నోట్లు చెల్లకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నారు. టోల్ ప్లాజాల వద్ద ఐదు వందలు, వేయి రూపాయల నోట్లను తీసుకోవడం లేదు.
తగిన చిల్లర లేకపోవడంతో డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన సంఘటనలు ఇటు తెలంగాణలోనూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ చోటు చేసుకున్నాయి. తిరుపతిలో ఇటువంటి తగాదా ఒక్కటి జరిగింది.
దళారుల ప్రవేశం
ఇదిలావుంటే, బడా నోట్లను మార్చుకోలగమనే ధీమా ఉన్న కొంత మంది దళారులుగా మారి ప్రస్తుత స్థితిని క్యాష్ చేసుకుంటున్నారు. దళారులు పది శాతం కమిషన్ తీసుకుని చిల్లర ఇస్తున్నారు. ఇది హైదరాబాదులో జోరందుకుంది.

నెల ప్రారంభమై వారం రోజులే కావడంతో చాలా మంది ఇంటి ఖర్చులకు.. ఇతర అవసరాలకు నగదు డ్రా చేస్తారు. సాధారణంగా వారి వద్ద 500, 1000 నోట్లే ఉంటాయి. ఇలాంటి వారూ తిరిగి వాటిని మార్చుకొనేందుకు బ్యాంకులకు పరిగెత్తాల్సి ఉంటుంది. తక్షణ అవసరాలకు తమ వద్ద ఉన్న నగదు వారికి అవసరం రాని పరిస్థితి ఏర్పడింది.
గ్రామీణ ప్రాంతాల్లో కష్టమే..
గ్రామీణ ప్రాంతాల్లో ఐదు వందలు, వేయి రూపాయల నోట్లను మార్పిడి చేసుకోవడం కష్టంగానే ఉండవచ్చు. దేశవ్యాప్తంగా సుమారు 7 లక్షల గ్రామాలు ఉన్నాయని అంచనా. కానీ ప్రతి గ్రామంలో బ్యాంకులు లేవు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు, వ్యాపారులు పెద్ద నోట్ల మార్పిడిలో ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది.
పెద్ద నోట్ల మార్పిడికి పలు నిబంధనలు పెట్టడంతో వీరు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకొనేందుకు అన్ని పనులు మానుకొని కొన్ని రోజులపాటు సమీప ప్రాంతాల్లోని బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్ష రూపాయలు ఉంటే నెల రోజులు ప్రతి రోజూ బ్యాంకుల చుట్టో పోస్టాఫీసుల చుట్టో తిరగాల్సిన పరిస్థితి ఉంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications