నోట్ల రద్దుతో 4 లక్షల ఉద్యోగాలు పోవచ్చు! వీటికే పెద్ద దెబ్బ

రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణంగా దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

న్యూఢిల్లీ/హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణంగా దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు కారణంగా భారత ఆర్థిక వృద్ధి ఒక శాతం తగ్గిపోతుందని, దాంతో వచ్చే ఏడాది లక్షల ఉద్యోగాలు పోవచ్చునని అంటున్నారు.

ఈ-కామర్స్ రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు పోవచ్చునని, రాబోయే రెండేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు పోవచ్చునని అంటున్నారు. ఈ-కామర్స్ వ్యాపారంలో 70 శాతం వరకు క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో జరుగుతాయి.

Demonetisation could take away 400000 jobs;e-com to be worst hit

కానీ, ప్రజల వద్ద నగదు ఎక్కువగా అందుబాటులో లేకుంటే చాలావరకు లావాదేవీలు మానేస్తారని, వ్యాపారం జరగనప్పుడు ఈ కామర్స్ రంగంలో అంతమంది ఉద్యోగులు అవసరం ఉండదు కాబట్టి, ప్రధానంగా డెలివరీ రంగంలో ఉద్యోగాలు తగ్గుతాయని అంటున్నారు.

అలాగే, లగ్జరీ వస్తువులను తయారు చేసి, అమ్మే కంపెనీల పైన కూడా తక్షణ ప్రభావం కనిపిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం నోట్ల ఇబ్బందుల నేపథ్యంలో ప్రజలు లగ్జరీ మీద పెట్టే ఖర్చును ఇప్పటికిప్పుడు తగ్గిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. అలాగే, చేనేత రంగం పైన కూడా నోట్ల రద్దు ప్రభావం పడవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+