తెలంగాణ హోంమంత్రికి చేదు అనుభవం.. ప్రగతి భవన్ నుంచి వెనక్కి..
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ చర్యలు,లాక్ డౌన్ తదితర అంశాలపై ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం జరుగుతున్న వేళ హోంమంత్రి అక్కడికి వెళ్లారు. అయితే అనుమతి లేని కారణంగా భద్రతా సిబ్బంది ఆయన్ను లోపలికి అనుమతించలేదు. దీంతో చేసేది లేక ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. అయితే ఇదే సమావేశానికి హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే డీజీపీ మహేందర్ రెడ్డి హాజరుకావడం గమనార్హం.హోంమంత్రిని ప్రగతి భవన్‌లోకి అనుమతించకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే సమావేశానికి కొంతమందికే అనుమతి ఇచ్చారని.. మహమూద్ అలీ కాకతాళీయంగా ప్రగతి భవన్‌కు రావడంతో ఆయన్ను అనుమతించలేదని సీఎంవో వర్గాలు చెబుతున్నట్టు సమాచారం. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌కు వెళ్లి రాష్ట్రానికి తిరిగివచ్చినవారిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో సీఎం పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు.

ఈ సమావేశం అనంతరం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈటెల,అధికారులు కూడా సీఎం వెంట రాజ్‌భవన్‌కు వెళ్లారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు,తీసుకుంటున్న చర్యలపై సీఎం గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications