రూ.2 లక్షలు.. ఐటీ రిటర్న్‌లో కొత్త నిబంధన: ఆధార్-పాన్ లింక్‌కు 2 పరిష్కారాలు
ఆదాయపు పన్ను రిటర్ను పత్రంలో కొత్త నిబంధనలకు చోటు కల్పించారు. 2017-18 మదింపు సంవత్సరం (అంటే 2016-17 ఆర్థిక సంవత్సరం)లో దాఖలు చేయాల్సిన ఐటీ రిటర్ను పత్రంలో రుణాల చెల్లింపు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుం
ముంబై/హైదరాబాద్: ఆదాయపు పన్ను రిటర్ను పత్రంలో కొత్త నిబంధనలకు చోటు కల్పించారు. 2017-18 మదింపు సంవత్సరం (అంటే 2016-17 ఆర్థిక సంవత్సరం)లో దాఖలు చేయాల్సిన ఐటీ రిటర్ను పత్రంలో రుణాల చెల్లింపు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా కాలం ఉంది.
పెద్ద నోట్లు రద్దయిన అనంతరం 50 రోజుల కాల వ్యవధిలో రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపు వివరాలను ఆదాయపు పన్ను రిటర్ను (ఐటీఆర్)ల్లో తప్పకుండా పేర్కొనాల్సి ఉంటుంది. రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో చెల్లించి ఉంటేనే ఈ నిబంధన వర్తిస్తుంది.
వార్షిక ఆదాయానికి, నోట్ల రద్దు కాలంలో జమ చేసిన సొమ్మునకు పొంతన ఉన్నదీ లేనిదీ పరిశీలించడానికే ఈ ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఈ నిబంధన ఈ ఒక్క సంవత్సరానికే పరిమితం.

పాన్- ఆధార్ అనుసంధానికి కొత్త విధానం
రిటర్నుల్లో ఆధార్ సంఖ్యను పేర్కొనడాన్ని తప్పనిసరి చేశారు. పేర్లు సరిగ్గా నమోదు కాకపోవడంవల్ల ఆధార్, పాన్‌ల అనుంధానంలో ఇబ్బందులు తలెత్తడంతో ప్రభుత్వం రెండు పరిష్కార మార్గాలను కనుగొంది.

ఆధార్ వెబ్ సైట్లోకి వెళ్లి పేరు మార్పిడి చేసుకోవచ్చు
ఆధార్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేరు మార్పిడి చేసుకోవచ్చు. ఇందుకు ఆధారంగా పాన్ కార్డును స్కాన్ చేసి జతచేస్తే సరిపోతుంది. ఆధార్‌లో పేర్కొన్న సెల్ నెంబరునే ప్రస్తుతం కూడా ఉపయోగిస్తుంటే ఇది సాధ్యపడుతుంది. ఇది సులువైన మార్గమని ప్రభుత్వం పేర్కొంది.

పుట్టిన తేదీలు ఒకేలా ఉంటేనే..
ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా కూడా అనుసంధానం చేసే సౌకర్యం ఉంది. ఒన్ టైం పాస్‌వర్డ్ (ఓటీపీ) ద్వారా అనుసంధానం చేయవచ్చు. రెండు పత్రాల్లోనూ పుట్టిన తేదీ ఒక్క మాదిరిగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.

పెళ్లైన తర్వాత ఇంటి పేరు మారిన వారు..
ఒక పత్రంలో ఇంటి పేరుతో, మరో దానిలో పొడి అక్షరాలతో పేర్లు రాసిన వారు, పెళ్లయిన తర్వాత ఇంటి పేర్లు మారిన వారు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆధార్ నమోదుకు సొమ్ము వసూలు చేస్తే చర్యలు తీసుకుంటారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications