Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రతీ కుటుంబానికి రూ 5 లక్షలు ఉచితంగా, బడ్జెట్ లో భట్టి ప్రకటన - అమలు ఇలా..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27కు వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మొత్తం రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర పద్దును ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం - రూ.47,267 కోట్లుగా వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి రాష్ట్ర తలసరి ఆదాయం, అప్పులు, రెవెన్యూ వ్యయం వివరాలను వెల్లడించారు. అదే సమయంలో ప్రతీ కుటుంబానికి భీమా కల్పిస్తూ కొత్త పథకాన్ని డిప్యూటీ సీఎం భట్టి బడ్జెట్ లో ప్రకటించారు.

బడ్జెట్ ప్రసంగంలో భాగంగా భట్టి కొత్త పథకం ప్రకటించారు. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చే వ్యక్తి దురదృష్టవశాత్తుఅకస్మాత్తుగా దూరమైతే... ఆ కుటుంబంపడే మానసిక వేదన ఒకటైతే, వాళ్లు ఎదుర్కొనే ఆర్థిక విపత్తు మరొకటిగా పేర్కొన్నారు. ఒక్క సంఘటనతో ఆ కుటుంబం రోడ్డున పడుతుందని చెప్పుకొచ్చారు. ఆ భయం, ఆ అభద్రతాభావం ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ సంకల్పంగా పేర్కొన్నారు. ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశానికీ సాధ్యంకాని రీతిలో, కనివిని ఎరుగని ఒక మహాత్తర జీవిత బీమా పథకానికి ఈ బడ్జెట్ లో శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు.

Deputy CM Bhatti Announces insurance scheme for all families in the state in his budget speech here the Details

సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా పేద, మధ్యతరగతి, ధనిక అని తేడా చూడకుండా రాష్ట్రంలోని 1 కోటి 15 లక్షల కుటుంబాలకుప్రతి కుటుంబానికిఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్, 02, 2026 నుండి"ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం"నునూతనంగా ప్రవేశపెడ్తున్నట్లు వెల్లడించారు.

తెలంగాణ బడ్జెట్ లో కొత్త పథకాలు, శాఖల వారీ కేటాయింపులు..!!
తెలంగాణ బడ్జెట్ లో కొత్త పథకాలు, శాఖల వారీ కేటాయింపులు..!!

సంక్షేమానికి భారీగా కేటాయింపులు

అదే విధంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్లు - రూ.5,500 కోట్లు, మహాలక్ష్మి పథకం - రూ.4,305 కోట్లు, వడ్ల బోనస్ - రూ.3,500 కోట్లు, గృహజ్యోతి - రూ.2,080 కోట్లు,ఆరోగ్య శ్రీ - రూ.1143 కోట్లు, LPG సబ్సిడీ - రూ.723 కోట్లు, , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా - రూ.600 కోట్లు, విద్యుత్‌ సబ్సిడీ - రూ.14 వేల కోట్లు, బియ్యం సబ్సిడీ - రూ.3 వేల కోట్లు,కల్యాణలక్ష్మి, షాదీముబారక్ - రూ.3,683 కోట్లు, విద్యార్థుల మెస్ ఛార్జీలు - రూ.2,170 కోట్ల తో పాటుగా స్కాలర్‌షిఫ్‌లు - రూ.4,343 కోట్లు కేటాయింపులు చేసారు. రేషన్ కార్డుల ప్రక్రియ తమ ప్రభుత్వం నిరంతరం కొనసాగిస్తామని భట్టి ప్రకటించారు. రెండు లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+