ఏకగ్రీవం వెనుక .. సభలో గుట్టువిప్పిన భట్టి
Recommended Video

హైదరాబాద్ : డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతర పార్టీలు అభ్యర్థులు నిలుపకపోవడంతో ఆయన ఎన్నిక ప్రక్రియ యునానిమస్ అయ్యింది. దీనికి సంబంధించిన గుట్టును సభలో విప్పారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

ఎలా ఏకగ్రీవం అంటే ..?
సాధారణంగా ఒక అభ్యర్థి బరిలో ఉంటే ఎవరి ఎన్నికైనా ఏకగ్రీవమే ఇందులో ఎలాంటి సందేహం లేదు. డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఎన్నికపై చర్చ సందర్భంగా దీనికి సంబంధించిన లోగుట్టు చెప్పారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఉమ్మడి రాష్ట్రంలో తాను డిప్యూటీ స్పీకర్ గా పనిచేశానని గుర్తుచేశారు. ఆ సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి మద్దతు లేకున్నా విపక్ష టీఆర్ఎస్ పార్టీ సహకరించిందని గుర్తుచేశారు. ఆ పరోపకారానికి కొనసాగింపుగా ఏకగ్రీవానికి కాంగ్రెస్ సహకరించిందని చెప్పకనే చెప్పారు. దీనినిబట్టి అప్పుడు టీఆర్ఎస్ సహకరించినందునా .. ఈసారి తాము కో ఆపరేట్ చేశామని సెలవిచ్చారు.

రంగంలోకి వర్కింగ్ ప్రెసిడెంట్
డిప్యూటీ స్పీకర్ నోటిఫికేషన్ వచ్చి .. టీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావుగౌడ్ అభ్యర్థితం ఖరారు కాగానే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. శనివారం స్వయంగా సీఎల్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించారు. పద్మారావు గౌడ్ అభ్యర్థిత్వానికి సహకరించాలని కోరారు. వారి మధ్య ఎమ్మెల్సీ సీటుపై చర్చ వచ్చిన అది తన పరిధిలోని అంశం కాదని కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా గతంలో తాము సహకరించిన విషయాన్ని గుర్తుచేయడంతో కాంగ్రెస్ నేతలు అంగీకరించి .. పోటీకి అభ్యర్థిని నిలుపలేదు.

సభాను హుందాగా నడపండి
తాను గతంలో ఉప సభాపతిగా పనిచేసిన సమయంలో హుందాగా పనిచేశానని చర్చ సందర్భంగా చెప్పారు భట్టి విక్రమార్క. అధికార, విపక్ష పార్టీలు అనే తేడా లేకుండా చూశానని, మీరు కూడా అలాగే వ్యవహరించాలని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైందని ప్రత్యేకంగా ప్రస్తావించారు భట్టి విక్రమార్క.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications