‘కల్తీ కల్లు మత్తులో రాష్ట్రం-పదవి మత్తులో కెసిఆర్’
హైదరాబాద్: కల్తీ కల్లు మూలంగా రాష్ట్రంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించడంతో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అని ప్రశ్నించారు.
సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అబ్కారీ కార్యాలయం ఎదుట కల్తీ కల్లుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. పాలన యంత్రాంగం గాడి తప్పడంతో ప్రజల మనుగడ కష్టమైపోయిందన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఒంటెద్దు పోకడ అనుసరించడంతో తుగ్లక్ పాలన తలపిస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో సిఎం కెసిఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
రాష్ట్రంలో కల్తీ కల్లు రాజ్యమేలుతోందని, ప్రజా ప్రతినిధులు, కొందరు అధికారులు కుమ్మక్కై మోతాదుకు మించి కల్తీ చేస్తున్నారని ఆరోపించారు. సదరు కల్తీ కల్లును విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

ఇప్పటికే కల్తీ కల్లు మూలంగా సుమారు నూట యాభై మంది మరణించగా, వందలాది మంది మతిస్థిమితం కోల్పోయి పిచ్చివాల్లుగా మారి చికిత్స పొందుతున్నారని తెలిపారు. దీనికంతటికి ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపించారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు












Click it and Unblock the Notifications