సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి బోనాలు ఆరంభం- జనసంద్రం: దారులన్నీ ఆలయం వైపే

తెలంగాణవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొనే ఆషాఢ మాస ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం సికింద్రాబాద్ లష్కర్ బోనాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి ఆలయం ఈ తెల్లవారుజాము నుంచే భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు జంట నగరాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.

ప్రధాన అర్చకులు ఈ తెల్లవారుజామున 4:05 నిమిషాలకు ఆలయ ద్వారాలను తెరిచి, అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలను నిర్వహించారు. అనంతరం రంగురంగుల పుష్పాలతో, నూతన వస్త్రాలతో అమ్మవారిని దివ్యంగా అలంకరించి భక్తులకు తొలి దర్శన భాగ్యం కల్పించారు. మొదటి పూజను వీక్షించడానికి, అమ్మవారి దర్శనం కోసం అర్ధరాత్రి నుంచే వేలాది మంది భక్తులు ఉజ్జయినీ అమ్మవారి ఆలయం వద్ద క్యూలైన్లలో వేచి ఉండడం ఈ బోనాల ప్రాముఖ్యతను తెలియజేస్తోంది.

Devotees Line Up at Secunderabad Ujjayini Mahakali Temple as Grand Kickstarts to Bonalu Early hours

తెలంగాణ సాంస్కృతిక వైభవానికి నిదర్శనమైన ఈ ఉత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సంప్రదాయ పద్ధతిలో మొదటి బోనాన్ని సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనించాలని, రైతులు సకాలంలో కురిసే వర్షాలతో పాడిపంటలతో సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.

తిరుపతి పద్మావతి మహిళా కళాశాల హాస్టల్ నిర్వహణపై అసత్య ప్రచారాలు: టీటీడీ
తిరుపతి పద్మావతి మహిళా కళాశాల హాస్టల్ నిర్వహణపై అసత్య ప్రచారాలు: టీటీడీ

లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆలయ పరిసరాల్లో జీహెచ్ఎంసీ, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తోన్నారు. సికింద్రాబాద్ ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా వాహనాల మళ్లింపులను చేపట్టారు.

వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులు
వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులు

భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉండటంతో ఈసారి మహిళా భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తిభావంతో అలరారుతున్న ఈ శతాబ్దాల నాటి సంప్రదాయ వేడుక తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని చాటిచెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+