26వేల మంది పోలీసులతో భద్రత: గణేశ్ నిమజ్జనంపై ఖాకీ నిఘా, ఏరియల్ సర్వే!
హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించినట్లు తెలిపారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనమంటే వాహనాదారులకు చుక్కలే. ఓ పక్క నిమజ్జనంలో పాల్గొనేవాళ్లు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుంటే.. వాహనదారులు మాత్రం రోడ్డుపై ఇంచు కూడా కదల్లేక ఇబ్బందులు పడుతుంటారు. ప్రతీ సంవత్సరం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఈ బాధలు తప్పడం లేదు.
తాజాగా గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై డీజీపీ అనురాగ్‌శర్మ వివరాలు వెల్లడించారు. గతేడాది లాగే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ముందుగా నిర్వహించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. దీనికి గణేష్ ఉత్సవ కమిటీ కూడా ఒప్పుంకుందని,శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు కలగకుండడా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

హైదరాబాద్‌లో నిమజ్జనానికి భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించినట్లు తెలిపారు. 11 మంది ఐజీలు, నలుగురు డీఐజీలు, 10 మంది ఎస్పీలు, ఏడుగురు ఏఎస్పీలు, 122 మంది డీఎస్పీలు, 333 మంది సీఐలు, వెయ్యి మందికి పైగా ఎస్‌ఐలు, 80 ప్లాటూన్ల పారా మిలటరీ బలగాలు.. మొత్తంగా 26వేల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
భద్రతా విధుల కోసం ఏపీ నుంచి కూడా 1000మంది పోలీసులు రప్పిస్తున్నట్లు వెల్లడించారు. సీసీ కెమెరాల ద్వారా గణపతి శోభాయాత్ర మార్గాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. అలాగే ఏరియల్ సర్వే ద్వారా బందోబస్తును పరిశీలిస్తామని డీజీపీ తెలియజేశారు.
కాగా, గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 5న ప్రభుత్వం సెలవు దినం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు ఇది వర్తిస్తుంది. దీనికి బదులు వచ్చే రెండో శనివారాన్ని ప్రభుత్వం పని దినంగా ప్రకటించింది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications