BRS: బీఆర్ఎస్‍ను దెబ్బ కొట్టిన సిట్టింగ్‍లు..
తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి సిట్టింగ్ లకే అవకాశం ఇవ్వడం. సీఎం కేసీఆర్ 2018 లాగానే దాదాపు సిట్టింగ్ లందరికీ టికెట్ ఇచ్చారు. ఇదే పార్టీ దెబ్బ తీసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేల పై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ వారికి సీట్ ఇచ్చారు. అలాగే కేసీఆర్ తీరు కూడా కొంత మంది మేధావులు జీర్ణించుకోలేకపోయారు.
ఆంధ్రా కాంట్రక్టర్లే తెలంగాణ సొమ్మంతా తింటున్నారని తిట్టిన కేసీఆర్.. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వారికే కాంట్రాక్టులు ఇచ్చారు. చాలా మంది ఉద్యమకారులను పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కపాదంతో అణిచివేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారికి మంత్రి పదవులు ఇచ్చారు. దీన్ని తెలంగాణ సమాజం గమనించింది. తెలంగాణను కేసీఆర్ కుటుంబం చేతిలో చెక్కిందని చాలా మంది ప్రజలు బలంగా నమ్మారు. అందుకే బీఆర్ఎస్ ను ఓడగొట్టారు.

తెలంగాణను వ్యతిరేకించిన సీమాంధ్ర సెటిలర్లే బీఆర్ఎస్ కు ఓటు వేయడంతో హైదరాబాద్ రంగారెడ్డి ఆ పార్టీ గౌరవం దక్కించుకుంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ తీవ్రంగా దెబ్బతిన్నది. ఆ తర్వాత నిరుద్యోగులు బీఆర్ఎస్ ను దెబ్బ గొట్టారు.












Click it and Unblock the Notifications