అదిలాబాద్ కాంగ్రెస్‌లో బాహాబాహీ: స్టేజ్‌పై సీటు కోసం చొక్కాలు పట్టుకొని కొట్టుకున్నారు
కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. అదిలాబాద్‌లో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు ఎదుటే రెండు వర్గాలు గొడవకు దిగాయి. దీంతో వీహెచ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అదిలాబాద్: కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. అదిలాబాద్‌లో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు ఎదుటే రెండు వర్గాలు గొడవకు దిగాయి. దీంతో వీహెచ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇందిరా గాంధీ శతజయంతి వేడుకల్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. సుజాత, రామచంద్రా రెడ్డి వర్గీయుల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకుంది. వేదికపై కుర్చీ కోసం ఈ కొట్లాట జరిగింది.

ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు చొక్కులు పట్టుకొని కూడా కొట్టుకున్నారు. ఒకరిని మరొకరు తోసుకున్నారు. విహెచ్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వారు ఎంతకూ వినలేదు. దీంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications