రోజంతా ఈత: ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్

యాప్రాల్‌లోని పయనీర్ స్విమ్మింగ్ అకాడమీలో శనివారం సాయం త్రం 5:45 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 5:50 గంటల వరకు నిరంతరాయంగా ఈదుతూనే ఉన్నాడు.. వైద్యుల పర్యవేక్షణలో నిమిషానికి యాభై మీటర్ల వేగంతో మొత్తంగా 75కిలోమీటర్లు ఈదిన ఈ జాతీయ స్విమ్మర్ జ్యూస్ తాగేందుకు ప్రతీ గంటకోసారి 45 సెకన్ల విరామం మాత్రమే తీసుకున్నాడు.
తన తదుపరి లక్ష్యం ఇంగ్లీష్ ఛానల్ ఈదటమే అని దిలీప్ తెలిపాడు. ఇందుకోసం అహర్నిశలూ కృషి చేస్తానని చెప్తున్నాడు. దిలీప్ కుమార్ ప్రతిభ గురించి తెలిసినవారు యువకిశోరాన్ని అభినందిస్తున్నారు. దిలీప్ స్విమ్మింగ్‌ను రికార్డు చేసి ప్రతీ ఐదు గంటలకోసారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపారు.












Click it and Unblock the Notifications