రేవంత్ రెడ్డి పేరు పలకడం ఇష్టం లేదా?: చంద్రబాబుపై దర్శకేంద్రుడి పొగడ్తలు

Chandrababu Naidu- Revanth Reddy meeting: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై కనిపించబోతోన్నారు. నేడు దీనికి ముహూర్తం. ఈ సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ ఏర్పాటైంది. బేగంపేట్‌లోని ప్రజాభవన్ దీనికి వేదిక.

ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పవన్ కల్యాణ్, మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరుకానున్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరభ్ కుమార్ ప్రసాద్, శాంతికుమారితో పాటు ఆర్థికం, జలవనరులు, విద్యుత్, మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు.

Director K Raghavendra Rao has praised Telangana for invite Chandrababu Naidu as grand manure

విభజన సమస్యల పరిష్కారం దిశగా చంద్రబాబు తొలి అడుగు వేసిన విషయం. ఈ క్రమంలో రేవంత్ రెడ్డితో ముఖాముఖి భేటీకి ప్రతిపాదించారు. ఈ మేరకు ఇటీవలే ఆయనకు లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన శనివారం సమావేశమౌదామంటూ సూచించారు. విభజన సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు.

ఈ లేఖకు రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు చంద్రబాబుకు రిప్లై ఇచ్చారు. కొద్దిసేపటి కిందటే ఈ లేఖను పంపించారు. చర్చలకు రావాలంటూ ఆహ్వానించారు. ఇందులో పాల్గొనడానికి చంద్రబాబు శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆ హోదాలో హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి.

దీనితో ఆయనకు ఘనంగా స్వాగతం పలకడానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లో గల ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు ఈ స్వాగత ర్యాలీ కొనసాగింది. ఈ క్రమంలో హైదరాబాద్ మొత్తం పసుపుమయమైంది. ప్రధాన రహదారుల్లో చంద్రబాబు ఫ్లెక్సీలు, బ్యానర్లు పెద్ద ఎత్తున వెలిశాయి.

Director K Raghavendra Rao has praised Telangana for invite Chandrababu Naidu as grand manure

చంద్రబాబుకు స్వాగతం పలికిన తీరును ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు ప్రశంసించారు. హైదరాబాద్‌‌ను విశ్వ మహానగరంగా తీర్చిదిద్దిన చంద్రబాబు తెలంగాణకు వచ్చిన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికిన తీరు అద్భుతమని పేర్కొన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల కలయిక ఎన్నో శుభపరిణామాలను ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఈ మేరకు ఓ ట్వీట్ చేశారాయన. ఈ ట్వీట్‌లో- చంద్రబాబును ఆకాశానికెత్తేసిన రాఘవేంద్రరావు.. రేవంత్ రెడ్డి పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించకపోవడం వివాదానికి దారి తీసింది. ఈ ఇద్దరు సిఎంల కలయిక.. అని రాసుకొచ్చారే తప్ప రేవంత్ పేరును గానీ, ఆయనను ట్యాగ్ గానీ చేయలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+