వచ్చే 3 గంటలు భీకర వాన, ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరిక..!!

వాతావరణ శాఖ కీలక హెచ్చరిక చేసింది. వచ్చే మూడు గంటలు పలు ప్రాంతాల్లో పిడగులతో పాటుగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలోని అయిదు జిల్లాలతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ అలర్ట్ జారీ చేసింది. అత్యవసరం అయితే మినహా బయటకు వెళ్లవద్దని సూచించింది. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ లో వాన దంచి కొట్టింది. ఇప్పుడు మరో సారి అలర్ట్ రావటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

తెలుగు రాష్ట్రాలను వాన వీడటం లేదు. రానున్న మూడు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. దీంతో అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇక, ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయిదు జిల్లాలకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక చేసింది. రాగల మూడు గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

disaster-management-alerts-on-heavy-rains-in-next-three-hours-in-many-areas

పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అనకాపల్లి,కాకినాడ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా. విశాఖ,ఎన్టీఆర్, ఏలూరు, తిరుపతి, నెల్లూరు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న విపత్తుల నిర్వహణ శాఖ ఎల్లో అలర్జ్ జారీ చేసింది. 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు దగ్గర నిలబడరాదని సూచించింది. ఇక, బంగాళాఖాతంలో ఈ నెల 25న ఏర్పడే అల్ప పీడనం వాయుగుండంగా మారి రానున్న అయిదు రోజుల పాటుగా ఉత్తరాంధ్రతో పాటగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తా, యానాంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+