ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు వరుస సెలవులు - తాజా ఆదేశాలు..!!
రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో పలు జిల్లాలకు విద్య సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కుస్తున్న వానల కారణంగా విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం అయింది. హైదరాబాద్ లో పోలీసులు ముందస్తు సూచనలు చేస్తున్నారు. ఈ రోజు, రేపు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలల వరకు అన్ని విద్యాసంస్థలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ముందస్తు చర్యల్లో భాగంగా కలెక్టర్లు సెలవు ప్రకటించారు. జగిత్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు.

వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో
తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు మినహా బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్థానిక అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదే సమయంలో ప్రస్తుతం ప్రకటించిన సెలవు కారణంగా విద్యార్థుల బోధనకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేశారు. ప్రకటించిన సెలవుకు బదులుగా ఆగస్టు 8న (రెండో శనివారం) పాఠశాలలు పనిచేస్తాయని విద్యాశాఖ వెల్లడించింది. ఆ రోజు సాధారణ తరగతులు నిర్వహించి సిలబస్‌ను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు.













Click it and Unblock the Notifications