విజయ్ పార్టీలోకి తమిళనాడు మాజీ సీఎం - తేల్చి చెప్పిన ఓపీఎస్..!!
తమిళనాడులో విజయ్ తన మార్క్ రాజకీయం చూపిస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా కొత్త లెక్క లు తెర మీదకు వస్తున్నాయి. సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. డీఎంకే- అన్నాడీఎంకే నుంచి టీవీకేలోకి చేరికలు పెరిగాయి. ఇప్పటికే అయిదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ఈ సమయంలోనే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం డీఎంకే నుంచి విజయ్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. దీని పైన ఓపీఎస్ స్పష్టత ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి విజయ్ రాజకీయంగానూ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి చేరిన ఎమ్మెల్యేలతో పాటుగా తాను రాజీనామా చేసిన తిరుచ్చి లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలోనే తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా పని చేసిన నేతల పైన గురి పెట్టినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత ఓ పన్నీర్‌సెల్వం ఇక విజయ్ పార్టీ టీవీకేలో చేరేందుకు సిద్దం అయ్యారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. గత ఎన్నికలకు ముందు ఆయన అన్నా డీఎంకే వీడి డీఎంకేలో చేరారు. అయితే, తనకు పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన హామీ మేరకు తన కుమారుడు ఓపీ రవీంద్రనాథ్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అగ్రహం.. అసంతృప్తితో ఉన్నారు. డీఎంకేలో తమకు భవిష్యత్ లేదనే అభిప్రాయంతో ఉన్నట్లు ఆయన సన్నిహిత నేతలు చెబుతున్నారు.
దీంతో, ఓపీఎస్ త్వరలోనే డీఎంకే కు గుడ్ బై చెప్పి.. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అదే విధంగా ఓపీఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనూ డీఎంకే ఎంపీ తంగ తమిళ్ సెల్వన్ హవానే ఎక్కువగా సాగుతోంది. పార్టీ నాయకత్వం సైతం ఆయనకే ప్రాధాన్యత ఇవ్వటం ఓపీఎస్ కు నచ్చటం లేదు. దీంతో.. డీఎంకే నుంచి బయటకు రావాలని భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం కూడా ఇదే రకమైన ప్రచారం సాగింది.
ఆ సమయంలో పన్నీర్ సెల్వం తాను మారటం లేదంటూ జరిగిన ప్రచారం ఖండించారు. అవన్నీ వదంతులేనని కొట్టి పారేసారు. తిరిగి ఇప్పుడు అదే ప్రచారం మరో సారి తెర మీదకు వచ్చింది. అయితే.. ఓపీఎస్ సన్నిహిత నేతలు మాత్రం ఇప్పుడు పార్టీ మారుతారనే వార్తల్లో నిజం లేదని చెబుతున్నారు. టీవీకే నేతలు మాత్రం జరిగేదీ ఏంటో చూడండి అంటూ మరింత ఆసక్తి పెంచుతున్నారు. దీంతో, రానున్న రోజుల్లో తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications