సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్: ఎంతంటే?
సింగరేణి కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా సింగరేణి కార్మికులకు బోనస్‌ను శుక్రవారమే చెల్లించనున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందుకోసం సింగరేణి సంస్థ రూ. 358 కోట్లను విడుదల చేయాలని సింగరేణి సీఎండీ బలరామ్‌ను ఆయన ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సింగరేణిపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం సమీక్ష జరిపారు. అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.
కాగా, గత ఏడాది చెల్లించిన దీపావళి బోనస్ కంటే ఇది రూ. 50 కోట్లు అధికం కావడం గమనార్హం. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం సమయానికి దీపావళి బోనస్‌ను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. దీపావళి బోనస్ కింద ఒక్కొక్క కార్మికుడు రూ. 93,750 అందుకోనున్నారు. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 40 వేల మందికిపైగా కార్మికులకు ఈ బోనస్ అందించనుంది.

ఈ ఏడాది కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దీపావళి పండగకు ముందే చెల్లింపులు జరిగేలా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలిచ్చారు. కాగా, ఇటీవలే సింగరేణి ఉద్యోగులందరికీ 33 శాతం లాభాల వాటా కింద రూ. 796 కోట్లను కంపెనీ పంపిణీ చేసిందని సింగరేణి సీఎండి బలరామ్ తెలిపారు.
కాగా, 2023-24 ఏడాదిలో సింగరేణికి రూ. 4701 కోట్లు లాభం వచ్చిందని ఇటీవల డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో సింగరేణి కార్మికులకు రూ. 796 కోట్లు బోనస్‌గా ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ. 1.90 లక్షలు బోనస్ వస్తుందన్నారు.
సింగరేణి కార్మికులకు సంతోషంగా బోనస్ ప్రకటిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అంతేగాక, ఒప్పంద ఉద్యోగులకు కూడా ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత ఏడాది కంటే రూ. 20 వేలు అదనంగా బోనస్ ప్రకటించామని, సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్ ఉద్యోగులకూ బోనస్ ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కాగా, సింగరేణిలో మొత్తం 41,837 మంది పర్మినెంట్ ఉద్యోగులున్నారు. వీరితోపాటు కాంట్రాక్ట్ వర్కర్లుగా 25వేల మంది పనిచేస్తున్నారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications