కేసీఆర్ భాషపై తీవ్ర విమర్శలు: 'చిత్తశుద్ధి ఉండాలి', 'పూర్తిచేసింది బాబే'
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఇద్దరు చంద్రులూ దొంగలేనని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. సీఎంగా కేసీఆర్ తాను మాట్లాడే భాష మార్చుకోవాలని ఆమె సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చకుండా ఉంటాలంటే పార్టీ మారిన వారితో రాజీనామా చేయించాలని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో ఆర్డీఎస్‌ను బ్యారేజీగా నిర్మిస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రారంభించిన ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేసి ప్రజలకు నీళ్లివ్వాలని డిమాండ్ చేశారు. పొంతనలేని మాటలతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారని ధ్వజమెత్తారు.
ప్రజలకు కేసీఆర్ మాయమాటలు చెప్పి పాలన సాగిస్తున్నారని అన్నారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టి పాతవాటిని మూలన పడేయొద్దని, ఏ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ హామీలను నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఇక పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలంటే కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉండాలని అన్నారు.

అవమాన పరిచేలా కేసీఆర్ భాష: రావుల
పాలమూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడిన భాష తెలంగాణ ప్రజలను అవమాన పరిచేలా ఉందని టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి అన్నారు. భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు ప్రాజెక్టులను ప్రారంభించింది చంద్రబాబేనని గుర్తు చేశారు.
కృష్ణాపై జూరాల ప్రాజెక్టును ఎన్టీఆర్ ప్రారంభిస్తే చంద్రబాబు పూర్తిచేశారని అన్నారు. రామన్‌పాడు ప్రాజెక్టును కట్టింది టీడీపీయేనన్నారు. పాలమూరులో వంద పడకల ఆస్పత్రులు ఐదింటిని కట్టింది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. పాలమూరులో తాము కనిపించేలా అభివృద్ధిని చేస్తే సీఎం కేసీఆర్ మాత్రం ఊహాజనిత వాగ్దానాలిస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications