సభ్యులపై పిడిగుద్దులు: టిఆర్ఎస్‌పై అరుణ ఫైర్

హైదరాబాద్‌: అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజని మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యురాలు డీకే అరుణ అన్నారు. విపక్ష సభ్యులను మార్షల్స్‌తో అడ్డుకున్నారన్నారు. పార్టీ ఫిరాయించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరితే మార్షల్స్‌తో కలిసి అడ్డుకున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ సభ్యులు పోడియంలోకి చొచ్చుకొచ్చి వ్యవహరించిన తీరు సరికాదన్నారు.

గవర్నర్‌ సమక్షంలో విపక్ష నేతలపై టీఆర్‌ఎస్‌ సభ్యులు పిడిగుద్దులు కురిపించారని ఆరోపించారు. అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. అధికార మదంతో ప్రతిపక్షాలను బుల్‌డోజ్‌ చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి పాడె కట్టే సమయం దగ్గర పడిందని అరుణ అన్నారు.

తెలంగాణ ఉభయ సభల్లో ఇటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతాయని తాను కలలో కూడా ఊహించలేదని ఆమె అన్నారు. బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏలాంటి ఆలోచన కూడా చేయడం లేదని ఆమె అన్నారు. అందరినీ చెప్పుచేతల్లో ఉంచుకోవాలని బెదిరింపులకు దిగుతోందని అన్నారు.

 DK Aruna lashes out at TRS attitude in assembly

సభలో జరిగిన విషయాలను బయటకు చెప్పకుండా తమకు కావాల్సిన సమాచారాన్ని మాత్రమే విడుదల చేసి ప్రజలను తప్పు దారి పట్టిస్తోందని విమర్శించారు. సభలో జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోను బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశఆరు. ముఖ్యమంత్రి కెసిఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని ఆమె అన్నారు.

కెసిఆర్ గూండాగిరి చేస్తున్నారు

టీఆర్‌ఎస్‌ మందబలంతో ప్రతిపక్షాలపై దాడులకు దిగుతోందని రాజేంద్రనగర్‌ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ ఆరోపించారు. అసెంబీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుండాగిరికి పాల్పడుతున్నారని, దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఎన్నిరోజులు పాలిస్తారో తామూ చూస్తామని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నేతలంతా కలిసి పనిచేస్తామని, రేపటి నుంచి శాసనసభా సమావేశాలను జరగనివ్వబోమని ప్రకాష్‌ తేల్చి చెప్పారు.

బజారు రౌడీల్లా కొట్టుకుంటున్నారు

తెలంగాణ అసెంబ్లీలో శాసన సభ్యులు బజారు రౌడీల్లా కొట్లాడుకున్నారని సీపీఐ ఎమ్మెల్యే రవీంధ్ర కుమార్‌ విమర్శించారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మందబలంతో ప్రతిపక్షాలను అడ్డుకోవాలని చూడడం సరికాదన్నారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగం టీఆర్‌ఎస్‌ పార్టీ కరపత్రంలా ఉందని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+