పెద్ద పదవే లక్ష్యం!: డీకే అరుణ మనసులో మాట
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరతారనే వార్తలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. అయితే, తాను టిఆర్ఎస్ పార్టీలో చేరేది లేదని డీకే అరుణ పలుమార్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఆమె టిఆర్ఎస్ పార్టీలో చేరేది లేదని చెప్పారు. చాక్లెట్లు, బిస్కెట్లకు లొంగే వ్యక్తిత్వం తమది కాదని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. లొంగబోమని తెలిపారు.

అంతేగాక, కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తుకు భారీ ప్రణాళిక వేసుకున్నట్లు ఆ వ్యాఖ్యల్లో అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలుస్తారా? అని ప్రశ్నించగా.. సీఎం అభ్యర్థి ఎవరన్నది హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు.
అయితే, పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారా? అని ప్రశ్నించగా.. ప్రస్తుతం పీసీసీ మార్పు ఉండదని చెప్పారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉన్నందున ఇప్పటికిప్పుడు మార్పులుంటాయని తాను అనుకోవడంలేదని డీకే అరుణ తెలిపారు.
ఎన్నికల సమయంలో మాత్రం పీసీసీ మార్పు తప్పనిసరిగా ఉండవచ్చని అన్నారు. అప్పుడు తప్పకుండా పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడతానని డీకే అరుణ చెప్పారు. పరోక్షంగా కాంగ్రెస్‌లో పెద్ద పదవినే అరుణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ!












Click it and Unblock the Notifications