వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్‌తో విభేదాల్లేవ్: ఓకే చెప్పిన డీకే, నో కామెంట్ అని కోమటిరెడ్డి

టీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ స్పందించారు. శుక్రవారం ఆమె ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. కాంగ్రెస్‌లోకి రేవంత్ రావడం వల్ల తనకు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే అరుణ స్పందించారు. శుక్రవారం ఆమె ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. కాంగ్రెస్‌లోకి రేవంత్ రావడం వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు.

'రేవంత్‌కు ఎందుకంత ప్రాధాన్యత? ఆ మచ్చ మనకెందుకు?': చేరికపై కాంగ్రెస్‌లో రచ్చ 'రేవంత్‌కు ఎందుకంత ప్రాధాన్యత? ఆ మచ్చ మనకెందుకు?': చేరికపై కాంగ్రెస్‌లో రచ్చ

రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. అధిష్ఠానం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాను కట్టుబడే ఉంటానని మాజీ కేంద్రమంత్రి అయిన డీకే అరుణ స్పష్టం చేశారు.

dk aruna on Revanth reddy's joining in Congress issue

ఇది ఇలావుంటే.. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారన్న కథనాలపై స్పందించాలని కోరగా.. ఆ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోకామెంట్‌ అంటూ సమాధానం దాటవేశారు. రేవంత్‌ విషయాన్ని తనతో ఎవరూ చర్చించలేదని అన్నారు.

ఇటీవలి కురిసిన వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పత్తి, వరికి మద్దతు ధర రావడంలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. రైతు సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 27న రెండులక్షల మంది రైతులతో 'ఛలో అసెంబ్లీ' నిర్వహిస్తామని తెలిపారు.

English summary
Congress senior leader DK Aruna responde on Revanth reddy's joining in Congress issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X