పాలమూరు పూర్తి కాదు కానీ, కేబినెట్లో ద్రోహులు: డికె అరుణ
మహబూబ్ నగర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ తెలంగాణ రాష్ట్ర మంత్రుల పైన బుధవారం నిప్పులు చెరిగారు. పాలమూరు ఎత్తిపోతల డిజైన్ మార్పుతో కొత్త వివాదాలు సృష్టించాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.
ప్రతిపక్షాలను సంప్రదించకుండానే డిజైన్‌లో ఎలా మార్పులు చేస్తారని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల ఇప్పట్లో పూర్తయ్యేది కాదన్నారు. కాబట్టి ప్రభుత్వం పెండింగు ప్రాజెక్టుల పైన తన దృష్టిని సారించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే సాగునీరు వస్తుందన్నారు. తెలంగాణ ద్రోహులను కేబినెట్లో పెట్టుకొని తమను విమర్శించడం విడ్డూరమని డికె అరుణ అన్నారు. తమను విమర్శించే నైతిక హక్కు టిఆర్ఎస్ నేతలకు లేదన్నారు.

వృద్ధి రేటు సాధిస్తున్నాం: ఈటెల
రాబోయే రోజుల్లో తెలంగాణ ఆదాయం మరింత గొప్పగా పెరగనుందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వేరుగా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాల మేరకే ఆదాయం పెరుగుతోందన్నారు. తెలంగాణ ఆదాయంపై కొన్ని పత్రికలు చేస్తున్న విషప్రచారం నమ్మొద్దన్నారు.
అన్ని రంగాల్లో వృద్ధి రేటును సాధిస్తున్నామని, బడ్జెట్ అంచనాలను సాధించే దిశగా వృద్ధి రేటు కొనసాగుతోందన్నారు. ఖజానాలో డబ్బు లేదనడం అవాస్తవమన్నారు. తెలంగాణ దేశంలోనే అగ్రగామి రాష్ట్రమన్నారు. సేల్స్‌ట్యాక్స్ వసూలు భారీగా పెరిగిందన్నారు.
గతేడాది జూన్‌లో రూ. 2,265 కోట్లు వసూలైతే ఈ ఏడాది జూన్‌లో రూ. 2,425 కోట్లు వసూలైందన్నారు. గతేడాది జులైలో రూ.24 వందల కోట్లు వసూలైతే, ఈ ఏడాది జులైలో రూ. 2,650 కోట్లు వసూలైందన్నారు.
రెవెన్యూ ఇన్‌కం అంచనా 28 శాతం ఉంటే ఇప్పటికే 24 శాతం సాధించామని, పరిశ్రమలకు అనుమతుల కోసం గతంలో పారిశ్రామికవేత్తలు చెప్పులు అరిగేలా తిరిగేవారన్నారు. ఇప్పుడు 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులిస్తున్నామన్నారు.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications