అప్పుడు ఏం పీకినవ్ కేసీఆర్?, నీలా బ్రోకర్‌గిరి చేయలే.: డీకే అరుణ సవాల్
Recommended Video

హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వనపర్తిలో నిర్వహించిన సభలో కేసీఆర్ తనపై చేసిన విమర్శలకు ఆమె ఘాటుగా స్పందించారు.

ఫొటోలు, వీడియోలు చూపించు
శనివారం ఉదయం డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. అనంతపురంకు ఇక్కడ్నుంచి నీళ్లు పోవాలని చెప్పినానా? రఘువీరాకు మంగళహారతులు పట్టి స్వాగతం పలికానా?.. అయితే ఫొటోలు, వీడియోలు చూపించూ అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు డీకే అరుణ.

అప్పుడు ఏం పీకినవ్ కేసీఆర్?
మీ పదవులు, కూర్చీల కోసం తప్ప ప్రజలను పట్టించుకున్నారా? అంటూ డీకే అరుణ.. కేసీఆర్‌ను నిలదీశారు. సీట్ల కోసం తన్లాట తప్ప తెలంగాణ ఉద్యమంలో ఏం చేశావని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ నేతలు మంత్రులయ్యారని, కేసీఆర్ కేంద్రమంత్రి అయ్యారని గుర్తు చేశారు. అప్పుడు ఏం పీకినవ్ అంటూ కేసీఆర్‌ను డీకే అరుణ నిలదీశారు.

అరుణమ్మ గురించి మాట్లాడతావా?
కేసీఆర్‌కు ఎన్నికలంటే తమాషా అయ్యిందని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంటు మీద ముందస్తుకు వెళితే గెలుస్తామనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అరుణమ్మ గురించి నువ్వు మాట్లాడతావా? అంటూ మండిపడ్డారు.
అరుణను విమర్శించే అర్హత లేదంటూ కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నీలా బ్రోకర్‌గిరి చేయలే..
‘నీ చరిత్ర.. నా చరిత్ర పాలమూరు ప్రజలను అడుగుదామా? నీలా బ్రోకర్‌గిరి చేయలేదు. పాస్ పోర్టు స్కాంలు చేయలేదు. మీది దగాకోరు ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీలోనే నీ రాజకీయం ప్రారంభమైంది. పూటకో పార్టీని మార్చెటోనివి' అంటూ కేసీఆర్‌పై డీకే అరుణ ధ్వజమెత్తారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications