నాతో చెప్పలేదేం: తెరాసలో చేరిన సోదరుడి 'వ్యాఖ్య'పై డీకే అరుణ అసహనం
హైదరాబాద్: తన సోదరుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలను కూడా అధికార టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తే, ఆ విషయం తనకు ఎందుకు చెప్పలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ గురువారం నాడు అసహనం వ్యక్తం చేశారు.
డీకే అరుణ సోదరుడు, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దాదాపు పదిహేను రోజుల క్రితం తెరాసలో చేరిన విషయం తెలిసిందే. ఆయన డీకే అరుణ సోదరుడు కావడం గమనార్హం. ఆయన చేరికతో తనకు సంబంధం లేదని డీకే అరుణ చెప్పింది. ఆనాడు సోదరుడి పైన మండిపడింది.

కాగా, గురువారం సిఎల్పీ భేటీ అయింది. వారు పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై చర్చించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తామని పరిగి ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా పాలేరు ఉప ఎన్నిక అభ్యర్థి ఖర్చుకు.. ఎమ్మెల్యేలు తమ నెల వేతనం ఇవ్వాలని నిర్ణయించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయం చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, సంపత్‌లు మాట్లాడుతూ.. తమను కూడా చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెరాసలోకి రమ్మని చెప్పారని వ్యాఖ్యానించారు. దానిపై డీకే అరుణ అసహనం వ్యక్తం చేసింది. ఆ విషయం నాతో అప్పుడే ఎందుకు చెప్పలేదని అడిగారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications