పరిహారం పట్ల రాజీపడొద్దు..! భూసేకరణ లో వేగం పెంచాలి..! మల్లన్న సాగర్ పై కేసీఆర్ సమీక్ష..!!
హైదరాబాద్: మల్లన్న సాగర్ జలాశయం పనుల పురోగతిపై సీఎం చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ నిర్వాసితులకు ఉపాధి, పునరావాసంపై ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. నిర్వాసితులకు యుద్ధ ప్రాతిపదికన పునరావాసం కల్పించాలని ఆదేశించారు.
నిర్వాసితులకు పరిహారం ప్రక్రియ ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యింది. మిగిలిన ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ఈ నెల 11 లోపు హైకోర్టుకు నివేదిక పంపాలని సూచించారు. నిర్వాసితులకు పరిహారం ప్రక్రియను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా పర్యవేక్షించాలని చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.

పరిహారం పంపిణీ కోసం గ్రామాల వారీగా శిబిరాలు నిర్వహించాలని, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ గుండెకాయ వంటిదని ముఖ్యమంత్రి అభివర్ణించారు. భూనిర్వాసితుల విషయంలో ప్రభుత్వం సానుభూతితో ఉందని, పునరావాసం విషయంలో దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా ప్యాకేజీ ఇస్తున్నామని చంద్రశేఖర్ రావు తెలియజేసారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 800 కోట్ల రూపాయలతో పరిహారం, పునరావాసం అందిస్తున్నామని తెలిపారు.
ఆరు ఏడు నెలల్లోనే మల్లన్నసాగర్ నిర్మాణం పూర్తి చేయాలని, వచ్చే ఏడాది జూన్‌లో రిజర్వాయర్‌లో నీళ్లు నింపాలనే లక్ష్యంతో పని చేయాలని సీఎం సూచించారు. మొత్తం ప్రక్రియలో కొద్దిపాటి పరిహారం ఇవ్వడమే మిగిలిందని, దాన్ని కూడా త్వరిత గతిన పూర్తి చేయాలని అదికారులకు చంద్రశేఖర్ రావు దిశానిర్దేశం చేసారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్










Click it and Unblock the Notifications