Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అపరిచితులు ఎవరైనా ఫోన్ అడిగితే ఇస్తున్నారా? అయితే జాగ్రత్త!

సమాజంలో సైబర్ నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి ఏ చిన్న అవకాశం దొరికిన సైబర్ నేరగాళ్లు ప్రజలను నిలుపు దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఫోన్ కాల్స్ రూపంలో ఎస్ఎంఎస్ ల రూపంలో వాట్సప్ మెసేజ్ ల రూపంలో రకరకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు తాజాగా కొత్త తరహా సైబర్ మోసాలకు తెరతీశారు.

ఎమర్జెన్సీ కాల్ చేసుకోవాలని సైబర్ మోసాలు
ఇక ఈ విషయాన్ని స్టాక్ బ్రోకింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు సీఈఓ అయిన నితిన్ కామత్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా పంచుకున్నారు. అపరిచిత వ్యక్తులు ఎమర్జెన్సీ కాల్ చేసుకోవాలంటూ ఫోన్ తీసుకుని చేస్తున్న సైబర్ మోసాల పైన ఆయన ఒక వీడియోను షేర్ చేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Do not give your phones to strangers if they ask for it for emergency purpose But be careful

అపరిచిత వ్యక్తులు ఫోన్ అడిగితే జాగ్రత్త అంటున్న స్టాక్ బ్రోకింగ్ కంపెనీ సిఈవో నితిన్ కామత్
ఇక ఆ వీడియోలో అపరిచిత వ్యక్తులు దగ్గరకు వచ్చి అత్యవసరంగా కాల్ చేసుకోవాలంటూ మీ మొబైల్ ని అడుగుతారు. చాలామంది ఎమర్జెన్సీ కావచ్చు అని భావించి సదుద్దేశంతో సానుకూలంగా స్పందించి వాళ్లకు ఫోన్లను ఇస్తారు. అయితే ఫోన్ తీసుకున్నవారు మీ ఫోన్ కు వచ్చే బ్యాంకింగ్ ఓటీపీలు రాకుండా నియంత్రించి మీ బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు అని మీకు నష్టాన్ని కలిగించి వెళ్తారు అని నితిన్ కామత్ వివరించారు.

అపరిచితులకు ఫోన్లు ఇస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ

ఫోన్ మాట్లాడుతున్నట్లుగా నమ్మిస్తూనే మన మొబైల్ ఫోన్లలో కొత్త యాప్లను ఇన్స్టాల్ చేసి పర్సనల్ డేటా డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలతో సెట్టింగ్స్ అన్నీ మారుస్తారని, దీనివల్ల మీ ఫోన్ నెంబర్లకు కాల్స్ మెసేజెస్ అలర్ట్ లు రాకుండా చేసి మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. అనధికారిక లావాదేవీలు జరిపి మోసాలకు పాల్పడతారని దీనికి సంబంధించి ఒక వీడియోను ఆయన షేర్ చేశారు.

నిజంగా ఎవరికైనా ఎమర్జెన్సీ కాల్ అయితే ఇలా చెయ్యండి
కాబట్టి ఇటువంటి మోసాల నుంచి కాపాడుకోవడానికి మొబైల్ ఫోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చి ఫోన్ ఇవ్వమని అడిగితే దయచేసి ఇవ్వద్దని ఆయన సూచించారు. ఒకవేళ నిజంగానే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే మీరే వారు చెప్పిన నెంబర్ కు కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలని వారితో చెప్పాలని సూచించారు. ఇక సైబర్ నేరాలు రోజుకో రకంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలన్నారు నితిన్ కామత్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+