ప్రేమిస్తున్నానని చెప్పి యువతిని మోసగించిన డాక్టర్
హైదరాబాద్: ప్రేమిస్తున్నానని ఓ యువతిని నమ్మించి మోసం చేసిన వైద్యుడిపై హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన రణధీర్‌రెడ్డి(28) దిల్‌సుఖ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు.
ఎంబీబీఎస్ పూర్తి చేసిన రణధీర్ స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. రహ్మత్‌నగర్‌లో ఉంటూ డిగ్రీ పూర్తి చేసిన యువతితో వీ చాట్ అనే యాప్‌లో చాటింగ్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు.
యువతి పెళ్లి మాట ఎత్తడంతో రణధీర్ తప్పించుకుని తిరుగుతున్నాడు.బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై సెక్షన్ 417,420ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వాస్తవ్యురాలైన కార్తీకతో అతను వీ చాట్ చేసి పరిచయం పెంచుకున్నాడు.

మేడిపల్లిలో పరుస దొంగతనాలు
రంగారెడ్డి జిల్లా మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల ఫీర్జాదీగుడాలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా ఉన్న మూడు దుకాణాల్లో శుక్రవారం రాత్రి వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. మెడికల్ షాప్, కిరాయి దుకాణం, చైనా బజార్ల షట్టర్లను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించి చోరీలకు పాల్పడ్డారు.
దొంగలు దాదాపు రు.2 లక్షల వరకు నగదును ఎత్తుకుపోయినట్లు సమాచారం. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications