హైదరాబాదులో డాక్టరే బ్రోతల్ హౌస్ నిర్వహిస్తున్నాడు, అరెస్ట్
హైదరాబాద్: అమీర్‌పేటలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న డాక్టరు వైభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతను వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడన్న సమాచారం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది.
శ్యామ్ లాల్ బిల్డింగ్ సమీపంలోని ఒక అతిథి గృహం వద్ద ఉన్న ఇంట్లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారంతో పోలీసులు శుక్రవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. ఒక మహిళతో పాటు డాక్టర్ వైభవ్, విశాల్ రాజ్, మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన వైభవ్ ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడు. మరో నిందితుడు విశాల్ బోయినపల్లి సమీపంలో నివసిస్తున్నాడు.

వైభవ్ రెండు నెలలుగా వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని, విటులకు తన ఫోన్ నంబరు ఇచ్చి అతిథి గృహానికి రప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులను అరెస్టు చేసి శనివారం నాడు రిమాండుకు తరలించారు.
అర్ధరాత్రి బైక్ రేసింగులు, పోలీసుల దాడులు
అర్ధరాత్రి బైక్ రేసింగులకు పాల్పడుతున్న యువకులను బంజారాహిల్స్ పోలీసులు చెక్ పెట్టారు. శనివారం అర్ధరాత్రి పలువురు యువకులు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు ప్రాంతంలో రేసింగులు నిర్వహిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు 25 మంది యుకులను అదుపులోకి తీసుకున్నారు. ఇరవైకి పైగా బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సీజ్ చేశారు. సదరు యువకుల తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ రప్పించి.. వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications