Population: దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. !
దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గడంపై తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ మంది పిల్లలను కనాలని చెబుతున్నారు. అయితే మన సౌత్ స్టేట్స్ లో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సగటు సంతానోత్పత్తి రేటు 1.7గా ఉందని దుర్గా జి రావు చెప్పారు. ఈ సంతాన లేమి సమస్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుందని ఆయన అన్నారు. సంతానం లేని ప్రతి నలుగురిలో ఒకరు ఇండియా నుంచి ఒకరు ఉన్నారు.
సంతానోత్పత్తి నిపుణుడు సగటు సంతానోత్పత్తి రేటు 2.1 ఉండాలి కానీ ఇది 1.7గా ఉందని పేర్కొన్నారు. సంతానోత్పత్తి రేటు దక్షిణాది రాష్ట్రంలో వేగంగా క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ సంతానోత్పత్తి రేటుతో ఉత్తరాది రాష్ట్రాలు ముందున్నాయ. మూడు దశాబ్దాల క్రితం 6 జంటలలో 1 దంపతులకు సంతానోత్పత్తి సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పుడు నలుగురిలో ఒకరికి సంతాన సమస్యలు ఎదురవుతున్నాయి. భవిష్యత్తులో ఇదే రేటుతో కొనసాగితే దక్షిణాదిలో జనాభా తగ్గే అవకాశం ఉందని దుర్గా జి రావు పేర్కొన్నారు.

ప్రస్తుతం జపాన్, కొరియా వంటి దేశాల్లో సంతాన లేమి సమస్య ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ దేశాలలో వృద్ధుల జనాభా పెరుగుతోందని.. యువ జనాభా క్షీణిస్తోందని వివరించారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే చాలా నిధులు వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉన్నప్పటికీ.. సంతానోత్పత్తి సమస్యలను పెరిగితే వృద్ధ జనాభా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
ప్రస్తుతం భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు మాత్రమే సగటు సంతానోత్పత్తి రేటు 2.1గా ఉన్నాయి. సంతాన లేమి సమస్యలకు దంపతులు ఉద్యోగం చేస్తే వేర్వేరు షిఫ్ట్లు ఉండడం, ధూమపానం, మద్యం సేవించడం కారణంగా అంచనా వేసింది. ఆహారం, నీటిని నిల్వ చేయడానికి ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించడం కూడా సంతానోత్పత్తిని ప్రభావితం చేసే అంశంగా పేర్కొంటున్నారు. హెచ్‌ఐవి ఎయిడ్స్‌కు సంబంధించిన ప్రచారాల మాదిరిగానే ప్రజల్లో అవగాహన పెంచేందుకు సంతానోత్పత్తిపై ప్రచారం చేయాలని కోరుతున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications