రాజీవ్ యువ వికాసం పథకం.. సిబిల్ స్కోర్ రూల్ ఉందా..? లేదా..?
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాజీవ్ యువ వికాసం పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువత కు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం కోసం రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని మార్చి 17న అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించింది.
రాష్ట్రంలోని నిరుద్యోగులు మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు రాజీవ్ యవ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం గడువు నిర్దేశించింది. గడువు పూర్తి అయింది కాబట్టి.. ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలు పెట్టింది.
ఈ ఎంపిక ప్రక్రియలో దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్దిదారులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2 న రుణాలు మంజూరు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎంపిక చేసిన 5 లక్షల మంది యువతకు రూ 6 వేల కోట్లు ఇవ్వనున్నట్లు రేవంత్ సర్కార్ పేర్కొంది. ఈ స్కీమ్ కింద కేటగిరీల వారీగా రాయితీ అందుతుంది. రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది.
అయితే రాజీవ్ యవ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్న యువత ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. రుణాలు మంజూరు కావడానికి సిబిల్ స్కోర్ నిబంధన విధించడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. సిబిల్ స్కోర్ 700 పైగా ఉండాలి అనే రూల్ మళ్లీ తెరపైకి రావడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక చాలా మంది పేద కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఈ రేంజ్ సిబిల్ స్కోర్ ఉండకపోవచ్చు. బ్యాంక్ లో జరిపిన లావాదేవీలు, గత రుణాల చెల్లింపుల ఆధారంగా బ్యాంకర్లు.. అభ్యర్థుల సిబిల్ స్కోర్‌ను పాన్ కార్డు ద్వారా సేకరిస్తున్నారు.
ఇదే విషయంపై ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం స్కీం లబ్ధిదారుల ఎంపికలో సిబిల్ స్కోర్ ను ప్రాధాన్యంగా తీసుకుంటారన్న వార్తలను ఆయన తప్పుబట్టారు. ఆ వార్తలు నిజం కాదని.. అందులో వాస్తవం లేదని అన్నారు. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని భట్టి క్లారిటీ ఇచ్చారు. దీంతో దరఖాస్తుదారులు ఊపిరి పీల్చుకున్నారు.

కానీ మళ్లీ సిబిల్ స్కోర్ వివాదం తాజాగా తెరమీదకు వచ్చింది. దీంతో ఈ విషయంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. అయితే జూన్ 2 లోపు దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
-
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
4 లక్షల కోట్లతో సమగ్రాభివృద్ధి దిశగా హైదరాబాద్ మెట్రో! -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ?












Click it and Unblock the Notifications