ఆ శునకం తెలివి చూడు.. గదిలోకి వెళ్లి మరీ.. చూసి నోరెళ్లబెట్టిన కూలీలు

అప్పుడప్పుడు కొన్ని వింతలు జరుగుతుంటాయి. అలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నారాయణ ఖేడ్ మండలంలో ఇటీవలే ఓ ఇల్లు నిర్మాణం పూర్తయ్యింది. అయితే తలుపు తీసేందుకు ప్రయత్నించి.. విఫలమయ్యారు. లోపల ఏముందో అని చూసిన ఏమీ కనిపించలేదు. మరోసారి చూస్తే.. వారికి తోక కనిపించింది. నిశీతంగా గమనిస్తే తెలిసింది.

తుర్కపల్లి తండా శివారులో వైకుంఠదామం నిర్మిస్తున్నారు. అందులో ఓ గదిని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల నిర్మాణం పూర్తి కాగా.. తలుపు కూడా ఏర్పాటు చేశారు. అయితే సున్నం మాత్రం వేయకపోవడంతో కూలీలు ఉదయాన్నే వచ్చారు. ఇంకేముంది తలుపు తీస్తే రావడం లేదు. లోపల ఎవరన్నా ఉన్నారో అని అనుకొన్నారు. తాగుబోతులు ఉన్నారా అని కూడా చూశారు. కానీ యూజ్.

dog lock door from inside room in sangareddy district

Recommended Video

    Mohammed Shami Sprints Alongside His Pet Dog To Improve Speed || Oneindia Telugu

    కిటికీల్లోంచి చూస్తే శునకం కనిపించింది. అదేంటి.. కుక్క లోనికొచ్చి గడియ పెట్టుకోవడం ఏంటీ అని అంతా ఆశ్చర్యపోయారు. అది లోపల ఉండటంతో బయటకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. పొడవైన కర్రతో తలుపు గడియ తీసేందుకు అపసోపాలు పడ్డారు. చివరికీ డోర్ తీయగా.. ఆ శునకం హమ్మయ్యా అంటూ బయటకు పరుగుతీసింది. దానిని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+