కాషాయ పార్టీని నమ్మొద్దు.!అది అబద్దాల పార్టీ.!ఆత్మీయ సమ్మేళనంలో గర్జించిన ఎమ్మెల్సీ కవిత.!
నిజామాబాద్/హైదరాబాద్: తెలంగాణలో గులాబీ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు జోరుగా ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ది సంక్షేమ పథకాలు, ప్రతిపక్షాల అసత్యప్రచారాలను ఎండగట్టమే ద్యేయంగా ఈ సమ్మేళనా కార్యక్రమాలను రూపొందించారు పార్టీ ముఖ్య నేతలు. బుధవారం రోజున నిజామాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. బీజేపి పార్టీ నినాదాలు చెప్పింది తప్ప ప్రజలకు నిజాలు చెప్పలేదని విమర్శించారు.
కమలంపై కవిత కన్నెర్ర : కాషాయ కండువా కప్పుకున్న వాళ్లు జై జవాన్... జై కిసాన్ అని ఒర్రుతారని, డబ్బాలో రాళ్లు వేసి ఊపినట్లు ఒర్రుడే తప్పా వాళ్లు కిసాన్ కు, జవాన్ కు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. అదే సీఎం చంద్రశేఖర్ రావు అమరులైన జవాన్లకు కుటుంబాలను ఆదుకున్నారని స్పష్టం చేశారు. నిజమైన దేశ భక్తుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రశేఖర్ రావేనని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలోని 65 లక్షల రైతులకు రూ. 65 వేల కోట్లును రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని, రైతులు బాగుంటేనే మనం బాగుంటామని కవిత సూచించారు.

అబద్దాల బీజేపి అని మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత : కేవలం నినాదాలకే పరిమితమైన పార్టీలను వదిలిపెట్టి అందరూ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారని కవిత తెలిపారు. బీఆర్ఎస్ అంటే ఒక మహాసముద్రమని, నదులు, ఉప నదులు, పిల్లకాలువలు చివరికి వచ్చి సముద్రంలోనే కలవాలని, అంటే అన్ని పార్టీల వాళ్లు వచ్చి గులాబీ కండువా కప్పుకోవాలి తప్పా నిజామాబాద్ లో వేరే పరిస్థితిలేదని కవిత అన్నారు. ఇతర రాష్ట్రాల్లో పేదల గురించి ఆలోచించే ప్రభుత్వాలు లేవని, కేవలం ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పేద ప్రజల గురించి ఆలోచన చేస్తోందని తెలిపారు.
బీజేపి సామాజిక మాధ్యమాల్లో అబద్దాలు ప్రచారం : ఇతర పార్టీల వాళ్లు సామాజిక మాధ్యమాల్లో అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ప్రతిపక్షాలు ఒక అబద్ధం చెబితే మనం 100 నిజాలు చెప్పి గట్టిగా కౌంటర్ చేయాలని కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. డివిజన్ ల వారీగా సోషల్ మీడియా సెల్ ను ఏర్పాటు చేయాలని మార్గనిర్ధేశం చేశారు. నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయాలని అన్నారు. అబద్దాలు చెప్పే వీ6 న్యూస్ ను చూడవద్దన్నారు. వెలుగు పత్రికలో పేరుకే వెలుగు అని పత్రిక మొత్తం చీకటే ఉంటుంది అని కవిత ఘాటుగా విమర్శించారు.

అవాస్తవాలు ప్రచారం చేస్తే తొక్కుతం.. కవిత హెచ్చరికలు : ప్రజలకు, మనకు వ్యతిరేకంగా రాస్తున్నారు కాబట్టి వాటిని బహిష్కరించాల్సిందేనని, అధికారికంగానే పార్టీ బహిష్కరించింది కాబట్టి అదే పంథాను కింది స్థాయి వరకు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అబద్దాలు ప్రచారం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. నాయకులంటే సంతలో గొర్రెల్లా కనిపిస్తున్నారా అని, ఆ సంస్కృతి బీఆర్ఎస్ పార్టీలో లేదని, ఈ విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలని కవిత సూచించారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications